నెపోటిజ‌మ్‌పై నిఖిల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

నెపోటిజ‌మ్‌పై నిఖిల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!
నెపోటిజ‌మ్‌పై నిఖిల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆక‌స్మిక  మ‌ర‌ణం బాలీవుడ్‌లో ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. ఆ వేడి తాజాగా టాలీవుడ్‌ని కూడా తాకింది. యంగ్ హీరో టాలీవుడ్‌లో వున్న బంధుప్రీతిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం కొత్త చ‌ర్చ‌కు దారితీస్తోంది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నెపోటిజమ్ కార‌ణంగా మృతి చెందాడ‌ని నెటిజ‌న్స్ బాలీవుడ్‌పై గ‌త కొన్ని రోజులుగా దుమ్మెత్తిపోస్తున్నారు. బాలీవుడ్ సెల‌బ్రిటీల‌ని అన్ ఫాలో చేస్తూ కొత్త ఉద్య‌మానికి శ్రీ‌కారం చుట్టారు.

ఇదిలా వుంటే టాలీవుడ్ హీరో నిఖిల్ బంధు ప్రీతిపై చేసిన వ్యాఖ్య‌లు ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తున్నాయి. ఆదివారం ఇన్‌స్టా లైవ్‌లో అభిమానుల‌తో ముచ్చ‌టించిన నిఖిల్ టాలీవుడ్ నే బంధుప్రీతి అన్న‌దే లేద‌ని షాకివ్వ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది. టాలీవుడ్‌లో నెపోటిజ‌మ్ అనేది లేదు. నేను నిజ‌మే చెబుతున్నా. న‌న్ను అంతా ఎంత‌గానో ప్రోత్స‌హించారు. టాలీవుడ్‌లో నేనూ ఓ భాగ‌మైనందుకు గ‌ర్వ‌ప‌డుతున్నాను. సుశాంత్ విష‌యానికి వ‌స్తే బంధుప్రీతి అనేది ప్ర‌తీ రంగంలోనూ వుంది. తొక్కేయాల‌ని ప్ర‌తీ రంగంలోనూ చూస్తారు. మ‌న క‌ష్టం, టాలెంట్‌తో నిల‌బ‌డాలి. ఎవ‌రెన్ని మాట‌ల‌న్నా ప‌ట్టించుకోకుండా స‌క్సెస్ కోస‌మే ప్ర‌య‌త్నించాలి.  కుటుంబ నేప‌థ్యంలా వున్నా లేకున్నా టాలెంట్ మాత్ర‌మే ఇక్క‌డ నిల‌బెడుతుంది.ఏది ఏమైనా అన్నింటికీ చావు ప‌రిష్కారం కాదు`అని నిఖిల్ స‌మాధానం చెప్పాడు.

నిఖిల్ ప్ర‌స్తుతం `కార్తికేయ 2 `, 18 పేజెస్ వంటి క్రేజీ చిత్రాల్లో న‌టిస్తున్నాడు. ఈ రెండు చిత్రాలు చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వున్నాయి. క‌రోనా కార‌ణంగా షూటింగ్‌ని నిర‌వ‌ధికంగా వాయిదా వేశారు. త్వ‌ర‌లోనే ఆ రెండు చిత్రాల షూటింగ్స్ ప్రారంభం కానున్నాయి.