పెళ్లి ప‌నుల్లో నిఖిల్ య‌మా బిజీ!


పెళ్లి ప‌నుల్లో నిఖిల్ య‌మా బిజీ!
పెళ్లి ప‌నుల్లో నిఖిల్ య‌మా బిజీ!

క‌రోనా కార‌ణంగా శుభాకార్యాలు, ఫంక్ష‌న్‌లు వాయిదా వేసుకుంటున్న విష‌యం తెలిసిందే. భారీ స్థాయిలో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రుపుకోవాల‌ని ఎన్నో ఆశ‌లు, ఎన్నో క‌ల‌లు క‌న్న వారంతా క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా త‌మ ప్లాన్‌ని మార్చుకుంటున్నారు. సింపుల్‌గా వివాహం చేసుకోవ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు. ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా అత్యంత స‌న్నిహితుల మ‌ధ్యే వివాహం చేసుకుంటున్నారు.

ఇటీవ‌ల స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు వివాహం, క‌న్న‌డ హీరో నిఖిల్ గౌడ్ పెళ్లి సాదా సీదాగా జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ రెండు పెళ్లిళ్ల త‌రువాత అదే త‌ర‌హాలో యంగ్ హీరో నిఖిల్ వివాహం ఈ గురువారం హైద‌రాబాద్‌లోని ఫామ్ హౌస్‌లో జ‌ర‌గ‌బోతున్న విష‌యం తెలిసిందే. గురువారం (14న‌) ఉద‌యం 6 గంట‌ల 31 నిమిషాల‌కు నిఖిల్ వివాహం డాక్ట‌ర్ ప‌ల్ల‌వితో జ‌ర‌గ‌బోతోంది.

ఇప్ప‌టికే పెళ్లి హంగామా మొద‌లైంది. నిఖిల్ కుటుంబ స‌భ్యులు, అత్యంత స‌న్నిహితులు మాత్ర‌మే ఈ వివాహానికి హాజ‌రు కాబోతున్నారు. ఉద‌యం పెళ్లి కావ‌డంతో నిఖిల్‌ని పెళ్లి కొడుకుగా, ప‌ల్ల‌విని పెళ్లి కూతురుగా ముస్తాబు చేశారు. దీంతో పెళ్లి హంగామా మొద‌లైంది. నిఖిల్‌ని పెళ్లి కొడుకుగా చేసిన ఫొటోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.