నితిన్, షాలినిల‌ వెడ్డింగ్‌కి డేట్ ఫిక్స్!‌నితిన్, షాలినిల‌ వెడ్డింగ్‌కి డేట్ ఫిక్స్!‌
నితిన్, షాలినిల‌ వెడ్డింగ్‌కి డేట్ ఫిక్స్!‌

ఓ ప‌క్క క‌రోనా వ‌ణికిస్తుంటే మ‌రో ప‌క్క టాలీవుడ్‌లో పెళ్లిళ్ల సీజ‌న్ న‌డుస్తోంది. ఎవ‌రూ ఊహించ‌ని వారంతా క‌రోనా కార‌ణంగా పెళ్లికి సిద్ధ‌మ‌వుతున్నారు. గ‌త కొంత కాలంగా పెళ్లంటే ముఖం చాటేసిన తార‌లంతా క్యూ క‌ట్టి మ‌రీ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. యంగ్ హీరో నిఖిల్ నుంచి ఈ వివాహాల హంగామా టాలీవుడ్ లో మొద‌లైంది.

నిఖిల్ త‌రువాత నిర్మాత దిల్ రాజు వివాహం చేసుకున్నారు. ఆగ‌స్టు 8న రానా కూడా వివాహం చేసుకోనున్న విష‌యం తెలిసిందే. నితిన్ కూడా ఎంతో కాలంగా ప్రేమిస్తున్న షాలినిని వివాహం చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు. రెండు నెల‌ల క్రిత‌మే వీరికి ఎంగేజ్‌మెంట్ జ‌రిగింది. అయితే వెడ్డింగ్ మాత్రం అట్ట‌హాసంగా దుబాయ్‌లో జ‌రుపుకోవాల‌ని నితిన్ ఎన్నో క‌ల‌లు క‌న్నారు. కానీ క‌రోనా కార‌ణంగా ఆ క‌ల‌ల‌న్నీ క‌రిగిపోయాయి. దీంతో సాదా సీదాగానే వివాహం చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్న నితిన్ ఈ నెల‌లోనే వివాహానికి సిద్ధ‌మైన‌ట్టు ఇటీవ‌ల వార్త‌లు వినిపించాయి.

తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ నెల 26న నితిన్ వివాహానికి ముహూర్తం ఫిక్స్ చేసిన‌ట్టు తెలిసింది. హైద‌రాబాద్ శివారులోని ఓ ఫామ్ హౌస్‌లో లిమిటెడ్ మెంబ‌ర్స్ పాల్గొన‌గా నితిన్, షాలినిల వివాహం జ‌ర‌గ‌నుంది. ప్ర‌స్తుత ప‌రిస్థితిలో మార్పులు వ‌చ్చాక ఇండ‌స్ట్రీ వారికి నితిన్ స్పెష‌ల్ పార్టీని ఏర్పాటు చేయాల‌ని ప్లాన్ చేస్తున్న‌ట్టు చెబుతున్నారు. గ‌త ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్న నితిన్‌, షాల‌నీల జంట ఈ నెల 26న వివాహ బంధంతో ఒక్క‌టి కాబోతోంది.