పుట్టినరోజు రద్దు ; పెళ్లి వాయిదా – కరోనా ఎఫెక్ట్

పుట్టినరోజు రద్దు ; పెళ్లి వాయిదా -  కరోనా ఎఫెక్ట్
పుట్టినరోజు రద్దు ; పెళ్లి వాయిదా – కరోనా ఎఫెక్ట్

భారత దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి అత్యవసర వైద్య సేవలు మినహా అన్ని రకాల సేవలు మరియు సర్వీసులను నిలిపివేసిన 21 రోజులపాటు లాక్ డౌన్ పాటించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికీ ఆదేశించాయి. ఇక ఈ నిర్ణయంతో ఈ నెల మరియు వచ్చేనెల జరగవలసిన వివాహాలు అన్నీ తాత్కాలికంగా వాయిదా పడ్డాయి.

కొన్ని పల్లెటూర్లలో ఇరువైపుల పెళ్లి పెద్దలు కూర్చుని పెళ్లి తంతు మాత్రం జరుపుకుంటున్నా సిటీలలో, నగరాలలో ఆమాత్రం కూడా మొక్కుబడి తంతు జరగని పరిస్థితి ఉంది. ఇంకా పెద్ద వాళ్ల ఇళ్లల్లో పెళ్లి అంటే.. అందరికీ తెలిసేలా జరుపుకోవాలి కదా..! కాబట్టి కచ్చితంగా అన్ని రకాల వివాహాలు వాయిదా పడ్డాయి.

తాజాగా రేపు అనగా మార్చి 30వ తేదీ పుట్టిన రోజు జరుపుకుంటున్న హీరో నితిన్ సైతం ప్రస్తుత పరిస్థితుల్లో తన పుట్టినరోజు జరుపుకోవడం లేదనీ అదే విధంగా ఏప్రిల్ 16వ తేదీన ముందుగా నిశ్చయించుకున్న తన వివాహాన్నికూడా వాయిదా వేసుకుంటున్నా” ననీ ప్రకటించారు.

అదేవిధంగా అభిమానులు తన పుట్టిన రోజు వేడుకలను ఏ విధంగా కూడా జరుపవద్దని, ఇప్పుడు మనందరరం బాధ్యతగా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి కలిసికట్టుగా పోరాటం చేయాలని, ప్రస్తుత సంక్షోభ సమయంలో ఇంటి వద్దనే ఉండి సురక్షితంగా మన కుటుంబంతో గడుపుతూ.. స్వీయ నిర్భంధము, వ్యక్తిగత పరిశుభ్రత మరియు సామాజిక దూరం పాటించాలని తద్వారా దేశానికి మన వంతు సేవ మరియు బాధ్యత నిర్వర్తించాలని నితిన్ ఈ సందర్భంగా అభిమానులకు విజ్ఞప్తి చేశారు.

ఇక అభిమానులకు తన పుట్టిన రోజు కానుకగా తన తాజా చిత్రం “రంగ్ దే” సినిమా యొక్క మోషన్ పోస్టర్ ను విడుదల చేసారు.