వివాహ బంధంతో ఒక్కైటైన నితిన్ – షాలిని జంట‌!వివాహ బంధంతో ఒక్కైటైన నితిన్ - షాలిని జంట‌!
వివాహ బంధంతో ఒక్కైటైన నితిన్ – షాలిని జంట‌!

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్‌గా వున్న నితిన్ ఈ ఆదివారం త‌న బ్యాచిల‌ర్ జీవితానికి గుడ్‌బై చెప్పేశారు. గ‌త ఎనిమిదేళ్లుగా ప్రేమిస్తున్న షాలినితో నితిన్ వివాహం ఆదివారం రాత్రి హైద‌రాబాద్‌లోని ఫ‌ల‌క్ నుమా ప్యాలెస్‌లో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. ఈ వివాహ వేడుక‌లో నితిన్‌, షాలినికి చెందిన కుటుంబ స‌భ్యులు, బంధువులు, టాలీవుడ్ ఇండ‌స్ట్రీకి చెందిన న‌టీన‌టులు, తెలంగాణ రాష్ట్ర మంత్రులు హాజ‌రై నూత‌న వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించారు.

కోవిడ్ నిబంధ‌న‌ల‌ను పాటిస్తూ ఈ వివాహాన్ని వైభ‌వంగా జ‌రిపించారు. నాగ‌ర్ క‌ర్నూల్ కు చెందిన డాక్ట‌ర్ సంప‌త్‌కుమార్‌, నూర్జ‌హాన్‌ల కూతురు షాలిని. ఓ కామ‌న్ ఫ్రెండ్ ద్వారా నితిన్‌కు షాలినితో ప‌రిచ‌యం ఏర్ప‌డింద‌ట‌. ఆ త‌రువాత ఆ ప‌రిచ‌యం ప్రేమ‌గా మారి గ‌త ఎనిమిదేళ్లుగా కొన‌సాగుతూ పెళ్లి పీట‌ల వ‌ర‌కు వ‌చ్చింద‌ని తెలిసింది. వీరి ప్రేమ పెళ్లికి ఇరు కుటుంబాల వారు అంగీక‌రాం తెల‌ప‌డంతో ఫ‌బ్ర‌వ‌రిలో ఎంగేజ్‌మెంట్ జ‌రిగింది. ఏప్రిల్‌లో దుబాయ్ వేదిక‌గా డెస్టినేష‌న్ వెడ్డింగ్ అనుకున్నారు.

కానీ క‌రోనా దెబ్బ‌తో ఏప్రిల్‌లో జ‌రిగాల్సిన వివాహం వాయిదా ప‌డింది. రోజు రోజుకి  క‌రోనా వైర‌స్ కేసులు పెరిగిపోతుండ‌టంతో నిరాడంబ‌రంగానే వివాహం చ‌సుకోవాల‌ని నిర్ణ‌యించుకున్న నితిన్ ఈ నెల 26న వివాహం చేసుకున్నారు.  ఈ వివాహ వేడుక‌లో ఇండ‌స్ట్రీ నుంచి హీరోలు వ‌రుణ్‌తేజ్‌, సాయి ధ‌ర‌మ్‌తేజ్‌, కార్తికేయ పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రులు త‌ల‌సాని శ్రీ‌నివాస‌యాద‌వ్‌, శ్రీ‌నివాస్‌గౌడ్‌, మాజీ ఎంపీ క‌విత‌తో పాటు ప‌లువురు టీఆర్ ఎస్ నాయ‌కులు పాల్గొని నూత‌న వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించారు.