ప్రభాస్ లవ్ మ్యారేజ్ చేసుకోనున్నాడా ?


Prabhas
Prabhas

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లవ్ మ్యారేజ్ చేసుకోనున్నాడా ? ఇంతకీ ప్రభాస్ వ్యాఖ్యల అంతరార్థం ఏంటి ? సాహో విడుదలకు సిద్దమైన నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చిన ప్రభాస్ పెళ్లి పై స్పందిస్తూ లవ్ మ్యారేజ్ చేసుకున్నా ఆశ్చర్యం లేదు కాకపోతే ఇప్పటివరకైతే ఎలాంటి ఆలోచన లేదు అంటూ తప్పించుకున్నాడు . లవ్ మ్యారేజ్ అంటూ నోటి వెంట వచ్చిందంటే బహుశా అనుష్కతోనే లవ్ మ్యారేజ్ కావచ్చు అంటూ ఊహాగానాలు చెలరేగుతున్నాయి .

అనుష్క – ప్రభాస్ ల ఆమధ్య ఏదో జరుగుతోందని చాలా కాలంగా గుసగుసలు వినిపిస్తున్నాయి . అయితే అవన్నీ గాలి వార్తలు మాత్రమే అని కొట్టిపడేసారు అనుకోండి . ఇక నిన్న జరిగిన సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అనుష్క పాల్గొనలేదు దాంతో కావాలనే అనుష్క ని పిలవలేదని , ఎందుకంటే అనుష్క ఈ వేడుకకి వస్తే మళ్ళీ ఆ వార్తలకు అవకాశం ఇచ్చినట్లే అని భావించడమే కారణం అని అంటున్నారు .