అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తున్న ప్రభాస్


Prabhas
Prabhas

గర్ల్ గ్యాంగ్ తో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నాడు . హీరోయిన్ శ్రద్దా కపూర్ తో పాటుగా సాహో చిత్రానికి పనిచేసిన పలువురు అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తున్న స్టిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది . టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ఎవరయ్యా అంటే టక్కున చెప్పే పేరు ప్రభాస్ .

బాహుబలి తర్వాత ఈ హీరో క్రేజ్ అమాంతం పెరిగింది , అంతేనా అమ్మాయిల్లో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో అయ్యాడు ప్రభాస్ . అమ్మాయిల కళల రాకుమారుడు అయ్యాడు , అయితే ఎంతమంది ప్రభాస్ ని ఆరాధిస్తున్న ఇతగాడు మాత్రం ఇంకా పెళ్లి చేసుకోవడమే లేదు . అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తున్నాడు ప్రభాస్ . ప్రస్తుతం చేస్తున్న సాహో ఆగస్టు 15 న విడుదల కానుంది . ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాడేమో చూడాలి .