హీరో రాజ్ తరుణ్ అరెస్ట్


Raj Tarun
Raj Tarun

యంగ్ హీరో రాజ్ తరుణ్ ని అరెస్ట్ చేసారు మాదాపూర్ పోలీసులు . నార్సింగ్ సర్కిల్లో జరిగిన కారు ప్రమాదంలో రాజ్ తరుణ్ నిందితుడు అన్న విషయం తెలిసిందే . నాలుగు రోజులుగా సాగిన హైడ్రామాకు రాజ్ తరుణ్ అరెస్ట్ తో తెరపడింది . అయితే మాదాపూర్ పోలీసులు రాజ్ తరుణ్ ని అరెస్ట్ చేసిన అనంతరం యాక్సిడెంట్ కి సంబందించిన వివరాలను పోలీసులకు అందించడంతో నోటీసులు ఇచ్చి సోమవారం కోర్టుకి హాజరు కావాల్సిందిగా ఆదేశాలు జారీ చేసారు .

అయితే అరెస్ట్ చేసినప్పటికీ నోటీసులు ఇచ్చి విడుదల చేసారు . దాంతో రాజ్ తరుణ్ ఇంటికి వెళ్ళిపోయాడు . ఇక సోమవారం రోజున కోర్టు ముందు హాజరుకానున్నాడు రాజ్ తరుణ్ . ఇదే కేసు విషయంలో కార్తీక్ అనే యువకుడి పై కూడా కేసు నమోదు అయ్యింది . బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడ్డాడని అతడిపై ఆరోపణలు ఉన్నాయి .