ఆ హీరోకు కష్టాలేనా


hero raj tarun career in troubleయంగ్ హీరో రాజ్ తరుణ్ నటించిన సినిమాలన్నీ ఘోర పరాజయం పొందుతున్నాయి దాంతో కెరీర్ కష్టాల సుడిగుండంలో పడిపోయింది . తాజాగా ఈ హీరో నటించిన లవర్ చిత్రం కూడా డిజాస్టర్ కావడంతో ఇక చేతిలో సినిమాలు లేకుండా పోయాయి . కొన్ని ఆఫర్లు ఉన్నాయి కానీ వాటిని అప్పుడే ఒప్పుకోవడం లేదు ఈ హీరో ఎందుకంటే వరుసగా సినిమాలు ప్లాప్ అవుతూ షాక్ ఇచ్చాయి దాంతో కొంత గ్యాప్ తీసుకొని మంచి కథలను ఎంచుకోవాలని అనుకుంటున్నాడట .

ఇటీవలే తిరుమల వెళ్లిన ఈ హీరో గుండు కొట్టించుకొని కెరీర్ లో గాడి పెట్టమని వేడుకున్నాడట వెంకటేశ్వర స్వామి ని . భక్తితో తలనీలాలు కూడా సమర్పించుకున్నాడు , మరి ఆ స్వామి రాజ్ తరుణ్ కష్టాలు తీరుస్తాడా చూడాలి . బ్యానర్ వేల్యూ ని చూసి సినిమాలు ఒప్పుకోకుండా మంచి కథలను ఎంచుకుంటే సక్సెస్ వస్తుంది కానీ పెద్ద పెద్ద బ్యానర్ లలో సినిమాలు చేస్తే హిట్స్ రావు కదా ! ఎలాగూ గ్యాప్ వచ్చింది కాబట్టి ఇకనైనా కాస్త అలోచించి కథలను ఎంచుకుంటే మళ్ళీ హిట్స్ కొట్టొచ్చు లేదంటే షరా మామూలే !

English Title: hero raj tarun career in trouble

hero raj tarun career in trouble