రాజ‌శేఖ‌ర్‌ ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉంది!

రాజ‌శేఖ‌ర్‌ ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉంది!
రాజ‌శేఖ‌ర్‌ ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉంది!

డాక్టర్ రాజ‌శేఖ‌ర్‌ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉంది. ఆయ‌న‌పై వ‌చ్చే తప్పుడు వార్త‌లను నమ్మవద్దని ఆయ‌న కుటుంబం విజ్ఞప్తి చేస్తోంది. అంద‌రు పాజిటివ్‌గా.. సానుకూలంగా వ్య‌వ‌హ‌రించాల‌ని ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్థించండ‌ని అంద‌రిని రాజ‌శేఖ‌ర్ ఫ్యామిలీ అభ్యర్థిస్తోంది. ఇట‌వీల క‌రోనా వైర‌స్ ల‌క్ష‌ణాల‌తో త‌న పిల్ల‌ల‌తో పాటు త‌ను, జీవిత కోవిడ్ బారిన ప‌డ్డామ‌ని హీరో డా. రాజ‌శేఖ‌ర్ వెల్ల‌డించిన విష‌యంమ తెలిసిందే.

ఆ త‌రువాత త‌న పిల్ల‌లు శివాని, శివాత్మిక ఇద్ద‌రూ కోలుకున్నార‌ని, నేను, జీవిత ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నామ‌ని, త్వ‌ర‌లోనే తాము కూడా కోవిడ్ బారి నుంచి బ‌య‌ట‌ప‌డ‌తామ‌ని డా. రాజ‌శేఖ‌ర్‌ స్ప‌ష్టం చేశారు. అయితే ఆయ‌న చిన్న‌ కుమార్తె గురువారం ఉద‌యం సోష‌ల్ మీడియా వేదిక‌గా పెట్టిన ఓ పోస్ట్ రాజ‌శేఖ‌ర్ అభిమానుల‌తో పాటు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌ని క‌ల‌వ‌రానికి గురిచేసింది.

కోవిడ్‌తో నాన్న‌పోరాడుతున్నార‌ని, ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాల‌ని అంతా ప్రార్థించాలని రాజ‌శేఖ‌ర్ చిన్న‌కుమార్తె శివాత్మిక రాజ‌శేఖ‌ర్ ట్వీట్ చేసింది. అయితే ఈ ట్వీట్ వైర‌ల్ కావ‌డంతో రాజ‌శేఖ‌ర్ ఆరోగ్య ప‌రిస్థితిపై పుకార్లు మొద‌ల‌య్యాయి. ఆ త‌రువాత త‌ప్పుడు వార్త‌ల్ని ప్ర‌చారం చేయొద్ద‌ని కోరినా అవి ఆగ‌డం లేదు. దీంతో హెల్త్ బులిటెన్ ని విడుద‌ల చేసిన ఫ్యామిలీ మెంబ‌ర్స్ రాజ‌శేఖ‌ర్ ఆరోగ్య ప‌రిస్థితిపై త‌ప్పుడు వార్త‌ల్ని ప్రచారం చేయొద్దంటూ విజ్ఞ‌ప్తి చేస్తున్నారు.