హీరో రామ్ కు ఫైన్ వేసిన చార్మినార్ ఎస్సై

Ram
Ram

హీరో రామ్ బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్ తాగడంతో చార్మినార్ ఎస్సై 200 రూపాయల ఫైన్ వేసాడు . సంఘటన చార్మినార్ వద్ద జరిగింది . ప్రస్తుతం హీరో ఇస్మార్ట్ శంకర్ అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే . కాగా సినిమా షూటింగ్ లో భాగంగా చార్మినార్ వద్ద ఇస్మార్ట్ శంకర్ షూటింగ్ జరుగుతోంది

అయితే షాట్ గ్యాప్ లో సిగరెట్ తాగాడు హీరో రామ్ . విషయం పక్కనే ఉన్న చార్మినార్ ఎసై చూడటంతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని 200 రూపాయల ఫైన్ వేసాడు . ఎస్సై ఫైన్ కట్టమని కోరడంతో 200 రూపాయలు చెల్లించాడు హీరో రామ్ . బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్ తాగడం నిషిద్ధం అనే విషయం తెలిసిందే . అయితే ఎవరు కూడా నియమాన్ని పాటించడం లేదు దాంతో పోలీసులు ఫైన్ వేస్తున్నారు