
`ఇస్మార్ట్ శంకర్`తో గత ఏడాది బ్లాక్ బస్టర్ హిట్‌ని సొంతం చేసుకున్నారు ఎనర్జిటిక్ స్టార్ రామ్. పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ చిత్రం రామ్ కెరీర్‌కి సరికొత్త టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. ఈ మూవీ తరువాత రామ్ నటించిన థ్రిల్లర్ ఎంటర్టైనర్ `రెడ్`. కిషోర్ తిరుమల ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. స్రవంతి రవికిషోర్ నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా వుంది.
లాక్డౌన్ కారణంగా గత కొన్ని నెలలుగా విడుదల వాయిదా పడుతూ వస్తున్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మూవీ తరువాత మరో చిత్రాన్నిరామ్ ఇంత వరకు ప్రకటించలేదు. చాలా వరకు కథలు విన్నా ఏ చిత్రాన్నీ ఇంత వరకు రామ్ ఫైనల్ చేయలేదు. ఇదిలా వుంటే హీరో రామ్ ఈ నెల 19 శనివారం రాత్రి యంగ్ డైరెక్టర్లకు ప్రత్యేకంగా పార్టీ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.
శనివారం రాత్రి హీరో రామ్ ఇచ్చిన పార్టీలో యంగ్ డైరెక్టర్స్ కిషోర్ తిరుమల, అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని, వెంకీ కుడుముల, సంతోష్ శ్రీనివాస్ పాల్గొన్నారు. సంతోష్ శ్రీనివాస్‌తో `కందిరీగ`, కిషోర్ తిరుమలతో `నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ, రెడ్ వంటి చిత్రాలు చేశారు. త్వరలో అనిల్ రావిపూడి, వెంకీ కుడుములతో సినిమాలు చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఆ కారణంగానే తను వర్క్ చేసిన చేయాలనుకుంటున్న దర్శకులకు రామ్ పార్టీ ఇచ్చినట్టు చెబుతున్నారు.