రామ్ `రెడ్`పై అది రూమ‌రే!రామ్ `రెడ్`పై అది రూమ‌రే!
రామ్ `రెడ్`పై అది రూమ‌రే!

ఎన‌ర్జిటిక్ హీరో `ఇస్మార్ట్ శంక‌ర్‌` హిట్ త‌రువాత మాంచి జోష్ మీదున్నాడు. ఇదే జోష్‌లో త‌న త‌దుప‌రి చిత్రం కూడా సూప‌ర్ హిట్ గ్యారెంటీ అనే మూడ్‌లోకి వెళ్లి పోయారు. సినిమాలో ఇంట్రెస్టింగ్ కంటెంట్ వుండ‌టంతో రామ్ సినిమా ఫ‌లితంపై పూర్తి న‌మ్మ‌కంతో వున్నారు. ఆయ‌న న‌టిస్తున్న తాజా చిత్రం `రెడ్‌. త‌మిళ హిట్ చిత్రం `త‌డ‌మ్‌` ఆధారంగా ఈ చిత్రాన్ని స్ర‌వంతి మూవీస్ బ్యాన‌ర్‌పై స్ర‌వంతి రికిషోర్ నిర్మిస్తున్నారు.

మాళ‌వికా శ‌ర్మ‌, నివేదా పూతురాజ్ హీరోయిన్‌లుగా న‌టిస్తున్నారు. కిష‌రోర్ తిరుమ‌ల తెర‌కెక్కిస్తున్న రొమాంటిక్ థ్రిల్ల‌ర్లో హీరో రామ్ తొలి సారి ద్విపాత్రాభిన‌యం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ నెల 9న రిలీజ్ చేయాల‌ని చిత్ర బృందం ప్లాన్ చేసింది. అయితే కోవిడ్ కార‌ణంగా లాక్ డౌన్ విధించ‌డంతో విడుద‌ల‌ను వాయిదా వేశారు.

అయితే ఈ చిత్రాన్ని తాజా ప‌రిస్థితులు కార‌ణంగా ఓటీటీ ప్లాట్ ఫామ్‌లో రిలీజ్ చేస్తున్నార‌ని ప్ర‌చారం మొద‌లైంది. దీనిపై హీరో రామ్ క్లారిటీ ఇచ్చిన‌ట్టు తెలిసింది. ఎట్టిప‌రిస్థితుల్లోనూ `రెడ్‌` థియేట్రిక‌ల్ రిలీజ్ మాత్ర‌మే అవుతుంద‌ని, డిజిట‌ల్ మీడియాలో రిలీజ్ కాద‌ని స్ప‌ష్టం చేశారు‌. డిజిట‌ల్ ప్లాట్ ఫామ్‌లో రిలీజ్ చేస్తే 20 కోట్లు ఇస్తామ‌ని ఓ ప్ర‌ముఖ ఓటీటీ కంపెనీ ఆఫ‌ర్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది., అయితే వారిచ్చిన ఆఫ‌ర్‌ని హీరో రామ్ సున్నితంగా తిర‌స్క‌రించిన‌ట్టు తెలిసింది.