షూటింగ్‌లో ఇస్మార్ట్‌కు ఏమైంది?


Hero Ram sensational comments on social media

షూటింగ్‌లో ఇస్మార్ట్‌కు ఏమైంది?
షూటింగ్‌లో ఇస్మార్ట్‌కు ఏమైంది?

డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ తొలి సారి ఎన‌ర్జిటిక్ హీరో రామ్‌తో క‌లిసి చేసిన చిత్రం `ఇస్మార్ట్ శంక‌ర్‌`. రామ్ కెరీర్‌లోనే సంచ‌ల‌న విజ‌యాన్ని సొంతం చేసుకుంది. వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్‌కు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని అందించింది. ఈ సినిమాతో రామ్ కెరీర్ ఒక్క‌సారిగా మారిపోయింది. ఈ సినిమా ఇచ్చినక్రేజ్‌తో రామ్ ప్ర‌స్తుతం డిఫ‌రెంట్ గెట‌ప్‌తో ఓ సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే.

`ఇస్మార్ట్ శంక‌ర్` త‌రువాత చాలా క‌థ‌లు విన్న రామ్ ద‌ర్శ‌కుడు కిషోర్ తిరుమ‌ల చెప్పిన క‌థ ట్రెండీగా వుండ‌టం, పాత్ర చిత్ర‌ణ కూడా కొత్త‌గా వుండ‌టంతో రామ్ గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చేశారు. `రెడ్‌` అనే టైటిల్‌తో రూపొందిస్తున్న ఈ చిత్రానికి కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. త‌మిళ హిట్ చిత్రం `త‌డ‌మ్‌` ఆధారంగా ఈ చిత్రాన్ని స్ర‌వంతి మూవీస్ బ్యాన‌ర్‌పై హీరో రామ్ బాబాయ్ స్ర‌వంతి రవికిషోర్ నిర్మిస్తున్నారు. ఇటీవ‌లే చిత్రీక‌ర‌ణ ప్రారంభ‌మైంది. సింగిల్ షెడ్యూల్‌లో సినిమాని పూర్తి చేయాల‌ని ద‌ర్శ‌కుడు కిషోర్ తిరుమ‌ల షెడ్యూల్‌ని ప్లాన్ చేశారు.

థ్రిల్ల‌ర్ క‌థాంశం నేప‌థ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో హీరో రామ్ ద్విపాత్రాభిన‌యం చేస్తున్నారు. హైద‌రాబాద్‌లో చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది. ఫైట్ మాస్ట‌ర్ పీట‌ర్ హెయిన్ నేతృత్వంలో యాక్ష‌న్ సీక్వెన్స్‌ని చిత్రీకరిస్తున్నారు. ఈ స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తుండ‌గా హీరో రామ్‌కు ముఖం, వీపు భాగంపై గాయ‌లైన‌ట్టు స్వ‌యంగా ఓ వీడియోని హీరో పోస్ట్ చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. `మీరు చూపించే ప్రేమ ముందు ఈ నొప్పి నెద్ద లెక్క కాదు. ర‌షెస్ చూశాను మైండ్ బ్లోయింగ్‌` అని రామ్ ట్వీట్ చేయ‌డంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.