బాంబ్ బ్లాస్ట్ లో గాయపడిన సందీప్ కిషన్


Hero sandeep kishan injured in bomb blast
Hero sandeep kishan injured in bomb blast

యంగ్ హీరో సందీప్ కిషన్ బాంబ్ బ్లాస్ట్ లో గాయపడ్డాడు . కర్నూల్ దగ్గర తెనాలి రామకృష్ణ చిత్ర షూటింగ్ జరుగుతుండగా బాంబ్ బ్లాస్ట్ జరిగింది . ఆ బాంబ్ బ్లాస్ట్ లో సందీప్ కిషన్ గాయపడ్డాడు . దాంతో చిత్ర బృందం ఒక్కసారిగా షాక్ అయ్యింది . షాక్ నుండి వెంటనే తేరుకున్న చిత్ర యూనిట్ సందీప్ కిషన్ ని కర్నూల్ లోని ఆసుపత్రికి తరలించారు . ప్రస్తుతం మెరుగైన వైద్యం అందుతోంది .

హాస్య చిత్రాల దర్శకుడు జి . నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో తెనాలి రామకృష్ణ అనే చిత్రంలో నటిస్తున్నాడు సందీప్ కిషన్ . తాజాగా యాక్షన్ సీన్స్ కోసం కర్నూల్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతున్న సమయంలో ఫైట్ మాస్టర్ సరైన జాగ్రత్తలు తీసుకోని కారణంగా సందీప్ కిషన్ బాంబ్ బ్లాస్ట్ బారిన పడ్డాడు . అయితే అదృష్టవశాత్తు ప్రాణాపాయం తప్పడంతో యూనిట్ వర్గాలు ఊపిరి పీలుసుకున్నారు .