డైరెక్టర్ పై ఫైర్ అయిన స్టార్ హీరో ఫ్యాన్స్


hero shiva rajkumar fans angry on director prem

కన్నడ నాట ఇద్దరు హీరోలతో సినిమా చేస్తూ అభిమానుల చేత తిట్లు తింటున్నాడు దర్శకుడు ప్రేమ్ . తమ హీరోకు అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదని ఆగ్రహిస్తూ దర్శకుడు ప్రేమ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ అభిమానులు . కన్నడంలో శివరాజ్ కుమార్ సూపర్ స్టార్ అన్న విషయం తెలిసిందే , కాగా తెలుగులో ఈగ చిత్రంలో నటించిన విలన్ కిచ్చా సుదీప్ కూడా అక్కడ అగ్ర హీరోనే !ఈ ఇద్దరి కాంబినేషన్ లో ” ది విలన్ ” అనే చిత్రం చేస్తున్నాడు ప్రేమ్ .

కాగా ది విలన్ చిత్రం లోని టీజర్ ని ఇటీవల విడుదల చేసారు అయితే సుదీప్ కి ఇచ్చిన ప్రాధాన్యత మా హీరో శివరాజ్ కుమార్ కు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ దర్శకుడు ప్రేమ్ ని తిడుతున్నారు అభిమానులు . మా హీరో స్టార్ హీరో అలాంటిది ఆయన్ని తక్కువ చేసి చూపిస్తారా ? టీజర్ లోనే ఇలా తక్కువ చేసి చూపిస్తే , సినిమాలో ఎలా చూపించారో ? మా హీరోని ఇంతగా అవమానిస్తారా ? అంటూ నిప్పులు చెరుగుతున్నారు శివరాజ్ కుమార్ అభిమానులు .

శివరాజ్ కుమార్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తీరు కి షాక్ అయిన ప్రేమ్ వెంటనే స్పందించి అసలు నేను ఏ పొరపాటు కూడా చేయలేదు రేపు సినిమా చూసాక తప్పు చేసానని అనుకుంటే నేను దేనికైనా సిద్ధమని విన్నవించు కుంటున్నాడు , కానీ ఫ్యాన్స్ మాత్రం అతడి మాటలను వినడమే లేదు . ది విలన్ సినిమా విడుదల అయితే కానీ ఈ వివాదం ఓ కొలిక్కి రాదనుకుంటా !

English Title:hero shiva rajkumar fans angry on director prem