శ్రీ‌కాంత్‌తో ఎన్టీఆర్ బ‌యోపిక్‌?


Hero Srikanth in Ntr biopic
Hero Srikanth in Ntr biopic

ఎన్టీఆర్ జీవిత క‌థ ఆధారంగా నంద‌మూరి బాల‌కృష్ణ ఓ బ‌యోపిక్‌ని నిర్మించిన న‌టించిన విష‌యం తెలిసిందే. ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు. ఎన్టీఆర్ మ‌హానాయకుడు పేర్ల‌తో విడుద‌లైన ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. ఇందులో నాణానికి ఒకే వైపు చూపించార‌ని, అస‌లుక‌థ‌ని గాలికి వ‌దిలేశార‌ని, ముఖ్యంగా ఎన్టీఆర్ రాజ‌కీయ జీవితానికి తాలూకూ చాలా కీల‌క అంశాల‌ని ప‌క్క‌న పెట్టార‌ని విమ‌ర్శ‌లు వినిపించాయి.

అ త‌రువాత వివాదాస్ప‌ద అంశాల్ని ప్ర‌ధాన క‌థావ‌స్తువుగా తీసుకుని రామ్‌గోపాల్ వ‌ర్మ `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌` పేరుతో పెద్ద వివాదాన్నే సృష్టించారు. తాజాగా ఎన్టీఆర్ కు సంబంధించిన కీల‌క అంశాల నేప‌థ్యంలో ఓ బ‌యోపిక్ రూపొందింది. అదే `చ‌ద‌రంగం`. హీరో మంచు విష్ణు నిర్మించి ఈ వెబ్ సిరీస్‌లో హీరో శ్రీ‌కాంత్ ఎన్టీఆర్ పాత్ర‌లో న‌టించిన‌ట్టు తెలుస్తోంది.

ఇందులో ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ ట‌చ్ చేయ‌ని ఎన్టీఆర్ జీవితంలోని చిక‌టి కోణాల్ని చూపించ‌బోతున్న‌ట్టు హీరో మంచు విష్ణు వెల్ల‌డించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఎన్టీఆర్‌కు మోహ‌న్‌బాబు అత్యంత స‌న్నిహితంగా మెలిగారు. ఆయ‌న ద్వారా కీల‌క అంశాల్ని తెలుసుకుని ఈ వెబ్ సిరీస్‌లో చూపిస్తున్నారా? ల‌ఏక మ‌రో కోణంలో ఎన్టీఆర్ జీవితంలోని తెలియ‌ని అంశాల్ని ఇందులో ప్ర‌స్థావిస్తున్నారా అన్న‌ది తెలియాలంటే ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే. జీ 5లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.