అభిమాని చనిపోవడంతో విలపించిన హీరో


hero sudeep shocked with hardcore fan died

తనని ఎంతగానో అభిమానించే అభిమాని కేన్సర్ తో బాధపడుతూ కన్ను మూయడంతో కన్నీళ్ల పర్యంతం అయ్యాడు కన్నడ హీరో కిచ్చా సుదీప్ . బెంగుళూర్ కి చెందిన వినూత అనే యువతి సుదీప్ కి వీరాభిమాని , అయితే గతకొంత కాలంగా వినూత క్యాన్సర్ తో బాధపడుతోంది . తన అభిమాన హీరో సుదీప్ ని చూడకుండానే చనిపోతానా అని తెగ బాధపడిందట ! ఈ విషయం సుదీప్ అభిమానులకు తెలియడంతో ఈ విషయాన్నీ సుదీప్ కు తెలిపారు .

 

విషయం తెలిసిన వెంటనే వినూత ని తన ఇంటికి పిలిపించుకొని ఆమె కు ధైర్యం చెప్పాడు .  సెల్ఫీ కూడా దిగాడు,తన అభిమాన హీరోని కలిసిన ఆనందంలో పరవశించిపోయింది వినూత .  అయితే కేన్సర్ మరింతగా ముదరడంతో మంగళవారం రాత్రి చనిపోయింది . తన అభిమాని చనిపోయిన విషయం తెలుసుకున్న కిచ్చా సుదీప్ విలపించాడు అంతేకాదు ఆమెతో కలిసి దిగిన ఫోటో ని ట్వీట్ చేసి నివాళులర్పించాడు సుదీప్ .