సుధీర్‌బాబు సిక్స్ ప్యాక్ లుక్ అదుర్స్‌!

సుధీర్‌బాబు సిక్స్ ప్యాక్ లుక్ అదుర్స్‌!
సుధీర్‌బాబు సిక్స్ ప్యాక్ లుక్ అదుర్స్‌!

టాలీవుడ్‌లో వున్న హీరోల్లో ఫిట్ నెస్ విష‌యంలో యంగ్ హీరో సుధీర్‌బాబు ముందుంటారు. ఫిట్నెస్ ప‌రంగా చాలా కేర్ తీసుకుంటుంటారు. లాక్‌డౌన్ సంద‌ర్భంగా సోష‌ల్ మీడియాలో ఇటీవ‌ల ఆయ‌న విడుద‌ల చేసిన వీడియోలే ఇందుకు నిద‌ర్శ‌నం. లాక్‌డౌన్ స‌మ‌యాన్ని త‌న ఫిట్ నెస్ కోసం ఉప‌యోగించి ఇంట్లోనే క‌స‌ర‌త్తులు చేస్తున్నారాయ‌న‌. నేడు సుధీర్‌బాబు పుట్టిన రోజు. ఆయ‌న న‌టిస్తున్న తాజా చిత్రం `వి`. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు.

ఈ సంద‌ర్భంగా చిత్ర బృందం రిలీ‌జ్ చేసిన పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంటోంది. సిక్స్‌ప్యాక్ బాడీతో ష‌ర్ట్‌ లెస్‌గా స‌ల్మాన్‌ఖాన్ త‌ర‌హాలో క‌నిపిస్తున్న లుక్ ఆక‌ట్టుకుంటోంది. సినిమాలో సుధీర్‌బాబు పోలీస్ ఆఫ‌స‌ర్‌గా న‌టిస్తున్నారు.‌  నేచుర‌ల్ స్టార్ నాని తొలిసారి ఈ చిత్రంలో ప్ర‌తినాయ‌కుడిగా న‌టించారు. ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ ద‌ర్శ‌‌క‌త్వంలో దిల్‌రాజు, శిరీష్ అత్యంత భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించారు. ముందు అనుకున్న ప్లాన్ ప్ర‌కారం  మార్చి 25న విడుద‌ల కావాల్సింది.

క‌రోనా కార‌ణంగా రిలీజ్‌ని వాయిదా వేశారు. లాక్‌డౌన్ త‌రువాత ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారంటూ ఈ సినిమాపై చాలా ప్ర‌చారం జ‌రిగింది. ఓటీటీలు భారీ ఆఫ‌ర్లు ఇవ్వ‌డం నిజ‌మేన‌ని, అయితే ఈ చిత్రాన్ని ఓటీటీల్లో కంటే థియేట‌ర్‌లోనే చూస్తే మ‌జా వుంటుంద‌ని, భారీ బ‌డ్జెట్‌తో చేసిన సినిమా ఇదిని హీరో సుధీర్‌బాబు వెల్ల‌డించారు.