నిర్మాతపై ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో


Hero Sumanth fires on idam jagath producer
Sumanth

సుమంత్ నిర్మాతలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసాడట ! తనతో ఇదం జగత్ అనే సినిమాని నిర్మించిన వాళ్ళు హడావుడిగా రిలీజ్ చేసారు అయితే పబ్లిసిటీ చేయకుండా రిలీజ్ చేయడంతో ఘోరమైన ఓపెనింగ్స్ వచ్చాయి . అసలు ఈ సినిమా విడుదల అయినట్లు చాలామంది కి తెలియదు దాంతో ఓపెనింగ్స్ లేకుండాపోయాయి . అయితే సినిమా ఎలాగూ విడుదల అయ్యింది కాబట్టి కలెక్షన్లు ఎలా ఉన్నాయి , టాక్ ఎలా ఉంది అన్న విషయం కనుక్కున్నాడట సుమంత్ .

ఇంకేముంది బయ్యర్ల నుండి వచ్చిన సమాధానం విని ఆగ్రహంతో ఊగిపోయాడట సుమంత్ . ఎందుకంటే ఘోరమైన కలెక్షన్లు ఈ సినిమాకు వచ్చాయి . ఇక థియేటర్ లు కూడా ఎక్కువగా లభించలేదు దాంతో ఇంత దారుణంగా ఎలా రిలీజ్ . చేసారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసాడట . సినిమా తీయడం ఇష్టం లేకపోతే సైలెంట్ గా ఉండాలి కానీ డబ్బులు పోసి తీసిన వాళ్ళు పబ్లిసిటీ చేయకుండా ఎలా విడుదల చేసారంటూ నిర్మాతని తిట్టేశాడట .

English Title: Hero Sumanth fires on idam jagath producer