సందీప్ కిషన్ పోస్టర్ ల తొలగింపు


Sundeep Kishan
Sundeep Kishan

సందీప్ కిషన్ నటించిన నిను వీడని నీడను నేనే చిత్రం పోస్టర్ లను చించి పడేసారు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ సిబ్బంది . నిన్న నిను వీడని నీడను నేనే చిత్రం కావడంతో ఆ పోస్టర్ లు , వినాయల్స్ అసభ్యకరంగా ఉన్నాయని ఫిర్యాదులు వెల్లువెత్తడంతో వెంటనే స్పందించిన జి హెచ్ ఎం సి అధికారులు ఆ పోస్టర్ లను తొలగించాలని ఆదేశాలు జారీ చేసారు .

అధికారుల ఆదేశాల మేరకు గ్రేటర్ సిబ్బంది సందీప్ కిషన్ నటించిన నిను వీడని నీడని నేనే పోస్టర్ లను పెద్ద ఎత్తున తొలగించారు . దాంతో షాక్ తిన్న సందీప్ కిషన్ తీవ్ర అభ్యంతరం చెప్పాడు . అనుమతి తీసుకొని పోస్టర్ లను వేస్తే , సినిమాకు మంచి టాక్ వచ్చిన ఈ సమయంలో పోస్టర్ లను తొలగించడం ఏంటి ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు .