క‌రోనా ఎఫెక్ట్‌: నో టీజ‌ర్‌.. సాంగ్ ఓన్లీ..!


క‌రోనా ఎఫెక్ట్‌: నో టీజ‌ర్‌.. సాంగ్ ఓన్లీ..!
క‌రోనా ఎఫెక్ట్‌: నో టీజ‌ర్‌.. సాంగ్ ఓన్లీ..!

క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తోంది. దీని ప్ర‌భావం కారణంగా చాలా వ్య‌స్థ‌లు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. అందులో సినిమా రంగం మ‌రీ ఇబ్బందిక‌ర ప‌రిస్థితుల్ని చ‌విచూస్తోంది. క‌రోనా విళ‌యంతో చాలా వ‌ర‌కు సినిమాల షూటిటింగ్‌లు ఆగిపోయాయి. కొన్ని రిలీజ్‌కు సిద్ధ‌మైన థియేట‌ర్లు లేక‌పోవ‌డంతో రిలీజ్‌లు ఆగిపోయాయి. ఇదిలా వుంటే సూర్య న‌టిస్తున్న త‌మిళ చిత్రం `సూరరాయిపోట్రు`.  రిలీజ్ కూడా వాయిదా ప‌డింది.

సుధా కొంగ‌ర తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రాన్ని `ఆకాశ‌మే నీహ‌ద్దురా` పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఏప్రిల్ 9నే ప్రేక్ష‌కుల ముందుకు రావాల్సింది కానీ క‌రోనా దెబ్బ‌తో రిలీజ్ వాయిదా ప‌డింది. ఏయిర్ డెక్క‌న్ జిఆర్ గోపీనాథ్ జీవిత క‌థ ఆధారంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్ర టీజ‌ర్ కోసం సూర్య ఫ్యాన్స్ చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. అయితే అది ఇప్ప‌ట్లో నెర‌వేరేలా క‌నిపించ‌డం లేదు. క‌రోనా కార‌ణంగా టీజ‌ర్‌ని టెక్నిక‌ల్ టీమ్ క‌ట్ చేయ‌లేద‌ట‌.

దీంతో సూర్య పుట్టిన రోజైన ఈ నెల 23న ఈ చిత్రంలోని ఓ పాట‌ని రిలీజ్ చేస్తున్నారు. కాటుక క‌న్నులే` అంటూ సాగే నిమిషం నిడివిగ‌ల ఈ వీడియో సాంగ్‌ని సూర్య బ‌ర్త్‌డే సంద‌ర్భంగా రిలీజ్ చేస్తున్నార‌ట‌. జీవీ ప్ర‌కాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని కీల‌క పాత్ర‌లో క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు క‌నిపించ‌బోతున్నారు.