క‌రోనా ఎఫెక్ట్‌: చిక్కుల్లో స్టార్ హీరో సినిమా?


 

Hero Suriya film in big trouble
Hero Suriya film in big trouble

క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని శాసిస్తోంది. చైనాలోని పుహాన్ న‌గ‌రంలో పుట్టిన ఈ అతి భ‌యంక‌ర‌మైన వైర‌స్
ఇప్పుడు వ‌ర‌ల్డ్‌ని వ‌ణికిస్తోంది. దీని బారిన ప‌డి కుప్ప‌లు తెప్పలుగా జ‌నాలు మృత్యువాత పుడుతూనే వున్నారు. డిసెంబ‌ర్‌లో పుట్టిన ఈ వైర‌స్ క్ర‌మ క్ర‌మంగా వ‌ర‌ల్డ్ మొత్తం పాకేస్తోంది. మ‌ర‌ణాల‌నీ పెంచేస్తోంది. దీని దెబ్బ‌కు రాష్ట్రాల‌న్నీ లాక్ డౌన్‌ని ప్ర‌క‌టించేశాయి. కేంద్ర స్ట్రిక్ట్‌గా లాక్ డౌన్‌ని పాటించాల‌ని ఖ‌రాకండీగా ఆదేశాల‌ని జారీ చేసింది.

లాక్ డౌన్‌ని తేలిగ్గా తీసుకుని ఎవ‌రు రోడ్ల మీద‌కి వ‌చ్చినా అరెస్ట్‌లు చేయండ‌ని సంచ‌ల‌న నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టింయింది. ఇదిలా వుంటే అన్నిరంగాలు లాక్ డౌన్‌ని స‌పోర్ట్ చేస్తుండ‌టంతో సినిమా రంగం కూడా లాక్ డౌన్‌ని ప్ర‌క‌టించింది. సినిమా రిలీజ్‌లు కూడా వాయిదా వేశారు. ఇదే త‌మిళ‌ హీరో సూర్య చిత్రాన్ని చిక్కుల్లో ప‌డేసింద‌ట‌. సూర్య హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం `సూరరాయిపోట్రు`. సుధా కొంగర తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో `ఆకాశ‌మే నీ హ‌ద్దురా` పేరుతో రిలీజ్ చేస్తున్నారు.

ఇప్ప‌టికే ఈ సినిమా బిజినెస్ పూర్తియింది. మంచి లాభాల్లో వుంది. అయితే లాక్ డౌన్ కార‌ణంగా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌కు ఇడ్డంది క‌లుగుతోంద‌ట‌. దీని కార‌ణంగా సినిమా రిలీజ్ ఆల‌స్యం అయ్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 9న రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేశారు. అయితే క‌రోనా వైర‌స్ కార‌ణంగా రిలీజ్ తేదీ వాయిదా ప‌డే అవ‌కాశాలే ఎక్కువ‌గా వున్నాయ‌ని. దీని కార‌ణంగా బ‌య్య‌ర్లు ఒత్తిడి తెచ్చే అవ‌కాశం వుంద‌ని తెలుస్తోంది.