మ‌ళ్లీ ఎమోష‌న‌ల్ అయిపోయిన సూర్య‌!


మ‌ళ్లీ ఎమోష‌న‌ల్ అయిపోయిన సూర్య‌!
మ‌ళ్లీ ఎమోష‌న‌ల్ అయిపోయిన సూర్య‌!

తెర‌పై హీరోయిజాన్ని చూపించే చాలా మందిలో హీరోలు ఎంత మంది అంటే చెప్ప‌డం క‌ష్ట‌మే. కానీ త‌మిళ చిత్ర సీమ‌లో మాత్రం ఈ సోద‌రులు తాము రీల్ లైఫ్‌లోనే కాదు రియ‌ల్ లైఫ్‌లోనూ హీరోల‌మే అని నిరూపిస్తున్నారు. హీరో సూర్య‌, అత‌ని సోద‌రుడు కార్తి గ‌త ప‌దేళ్లుగా చెన్నైలో అగ‌రం ఫౌండేష‌న్ పేరుతో ఓ స్వ‌చ్ఛంద సంస్థ‌ను రన్ చేస్తున్నారు. దీని ద్వారా త‌మిళ‌నాడు చుట్ట‌ప‌క్క‌ల వున్న గ్రామాల్లో క‌టిక పేద‌రికాన్ని అనుభ‌విస్తూ చ‌దువుకు దూర‌మ‌వుతున్న వారిని చేర‌దీసి వారి చ‌దువుకు అయ్యే ఖ‌ర్చుని గ‌త ప‌దేళ్లుగా వారే భ‌రిస్తున్నారు.

ఇటీవ‌ల జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో పేద‌రికంతో ఇడ్డందులు ప‌డుతున్న త‌న‌కు ఉన్న‌త చ‌దువులు చ‌దువుకునే అవ‌కాశాన్ని అగ‌రం ఫౌండేష‌న్ క‌లిగించిందని, త‌న తండ్రి చిన్న‌త‌నంలోనే చ‌నిపోతే త‌ల్లి కూలీప‌ని చేసి త‌న‌ని చ‌దివించింద‌ని ఓ అమ్మాయి స్టేజ్‌పై మాట్లాడిన తీరుకు హీరో సూర్య భావోద్వేగానికి లోనై క‌న్నీళ్లు పెట్టుకున్న విష‌యం తెలిసిందే. దీనికి సంబంధించిన ఓ వీడియో ఆ మ‌ధ్య వైర‌ల్ కావ‌డంతో సూర్య మ‌న‌సు ఎలాంటిదో అంద‌రికి అర్థ‌మైంది.

తాజాగా అగ‌రం ఫౌండేష‌న్ ప్రారంభ‌మై ప‌దేళ్లు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా సూర్య కుటుంబం ఓ పంక‌త్యేక కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్య‌క్ర‌మంలో హీరో సూర్య‌, కార్తి, తో పాటు సూర్య తండ్రి శివ‌కుమార్ కూడా పాల్గొన్నారు. ఈ సంస్థ‌ని నిరాటంకంగా న‌డ‌ప‌డానికి స‌హ‌క‌రిస్తున్న సిబ్బందికి రుణ‌ప‌డి వుంటాన‌ని చెప్పిన సూర్య మ‌రోసారి స్టేజ్‌పైనే ఏడ్చేయ‌డం పలువురిని క‌ల‌చివేసింది. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ప్ర‌స్తుతం సూర్య `ఆకాశ‌మే నిహ‌ద్దురా` చిత్రంలో న‌టిస్తున్నారు.