యంగ్ డైరెక్టర్ కి సూర్య గ్రీన్ సిగ్నల్Hero suriya green signal to young director lokesh kankarajan
Hero suriya green signal to young director lokesh kankarajan

కోలీవుడ్ లో యువ దర్శకులకు ఇప్పుడు మంచి డిమాండ్ ఏర్పడింది. సీనియర్ దర్శకుల కంటే యంగ్ డైరెక్టర్స్ బెస్ట్ అని రజినీకాంత్ – విజయ్ వంటి బాక్స్ ఆఫీస్ హీరోలు యువకులకు అవకాశాలు ఇస్తున్నారు. విజయ్ అట్లీతో  మూడు సినిమాలు చేసి తన మార్కెట్ ని పెంచుకున్నాడు. బిగిల్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.

అదే తరహాలో కార్తీ  కూడా యువ దర్శకుడితో చేసిన ఖైదీ సినిమా కూడా పాజిటివ్ టాక్ తో నడుస్తోంది. తెలుగులో కూడా ఆ సినిమా కలెక్షన్స్ పెరుగుతున్నాయి. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన యువ దర్శకుడు లోకేష్ కనగరాజాన్ స్టార్ హీరోల నుంచి మంచి ఆఫర్స్ అందుకుంటున్నాడు. నెక్స్ట్ విజయ్ ని డైరెక్ట్ చేయబోతున్న లోకేష్ కి సూర్య కూడా ఒక ప్రాజెక్ట్ కోసం ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. లోకేష్ విజయ్ తో సినిమా చేసిన తరువాత ఖైదీ 2 చేసే అవకాశం ఉంది.
ఇక త్వరలోనే సూర్య సినిమాని కూడా అఫీషియల్ గా ఎనౌన్స్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు తెలుస్తోంది. సూర్య ప్రస్తుతం సుధా కొంగర దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. అనంతరం సింగం డైరెక్టర్ హరితో కూడా ఒక సినిమా చేయనున్నాడు. వీటి తరువాత లోకేష్ సినిమా పట్టాలెక్కనుంది. ఆ లోపు విజయ్64 – ఖైదీ ప్రాజెక్ట్ లను ఈ దర్శకుడు పూర్తి చేస్తాడు. సో లోకేష్ – సూర్య ప్రాజెక్ట్ రావడానికి మినిమమ్ రెండేళ్లు పడుతుందన్నమాట.