సూర్య మామూలు హీరో కాదు రియ‌ల్ హీరో!


సూర్య మామూలు హీరో కాదు రియ‌ల్ హీరో!
సూర్య మామూలు హీరో కాదు రియ‌ల్ హీరో!

మ‌నం ఎంత సంపాదించాం అన్న‌ది కాదు.. ఎంత మందిని సంపాదించుకున్నాం. ఎంత మంచిని సంపాదించుకున్నాం అన్న‌ది ముఖ్యం. ఈ సూత్రాన్ని బాగానే వంట‌బ‌ట్టించుకున్నారు త‌మిళ హీరో సూర్య‌. ఎంత ఎదిగినా ఒదిగి వుండే సూర్య గత ప‌దేళ్లుగా అగ‌రం షౌండేష‌న్ పేరుతో ఓ స్వ‌చ్ఛంద సంస్థ‌ని న‌డిపిస్తున్నారు. దీని ద్వారా ఆర్థికంగా చితికి చ‌దువుకోలేని పిల్ల‌ల‌ని సేక‌రించి అగ‌రం ఫౌండేష‌న్ ద్వారా చ‌దువు చెప్పిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతూ తాను రీల్ హీరోను మాత్ర‌మే కాద‌ని రియ‌ల్ హీరోని కూడా అని నిరూపిస్తూ ప‌దిమందికి ఆద‌ర్శంగా నిలుస్తున్నారు.

ఇటీవ‌ల జ‌రిగిన అగ‌రం ఫౌండేష‌న్ కార్య‌క్ర‌మంలో ఓ అమ్మాయి ధీన గాథ విని వేదిక‌పైనే చ‌లించి చిన్న పిల్లాడిలా క‌న్నీళ్లు పెట్టుకున్నారు సూర్య‌. తాజాగా ఆయ‌న చేసిన ఓ ప‌ని ప‌లువురిని అబ్బుర‌ప‌రుస్లోంది. విమానం ఎక్కాల‌న్న‌ది సామాన్యుడికి జీవిత‌కాలం ఓ క‌ల‌గానే మిగిలిపోతుంటుంది. అలాంటి ఓ వంద మంది సామాన్యుల క‌ల‌సి ఈ గురువారం నిజం చేసి సూర్య త‌న గొప్ప మ‌న‌సును మ‌రోసారి చాటుకున్నారు.

సూర్య న‌టిస్తున్న తాజా చిత్రం `సూర‌రాయిపోట్రు`. ఇదే చిత్రాన్ని తెలుగులో `ఆకాశ‌మే నిహ‌ద్దురా` పేరుతో రిలీజ్ చేస్తున్నారు. సుధా కొంగ‌ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్ర ఫ‌స్ట్ సింగిల్‌ని చెన్నై ఏయిర్ పోర్ట్‌లోని స్పైస్ జెట్‌లో రిలీజ్ చేశారు. అనంత‌రం వంద మంది అగ‌రం ఫౌండేష‌న్‌లో చ‌దువుకుంటున్న పిల్ల‌ల్ని ఫ్లైట్ ఎక్కించి వారి క‌ల‌ని నిజం చేశారు. ఏడ‌వ త‌ర‌గతి చ‌దువుతున్న ఓ అమ్మాయి సూర్య‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్న ఓ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.