విజయ్ దేవరకొండకు సినిమా కష్టాలు


Hero title clash between vijay devarakonda and tamil hero

టాలీవుడ్ నయా సూపర్ స్టార్ విజయ్ దేవరకొండకు సినిమా కష్టాలు వచ్చి పడ్డాయి . తాజాగా ఈ హీరో ” హీరో” అనే చిత్రం చేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు . మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న హీరో చిత్రానికి తమిళ దర్శకుడు ఆనంద్ అన్నామలై దర్శకత్వం వహించనున్నాడు . ఇక ఈ సినిమాని తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ బాషలలో నిర్మించనున్నారు . అయితే ఇక్కడే సమస్య వచ్చి పడింది .

 

విజయ్ దేవరకొండ చిత్రానికి హీరో అనే టైటిల్ అనుకున్నారు . కట్ చేస్తే తమిళ హీరో శివ కార్తికేయన్ తాజాగా నటిస్తున్న చిత్రానికి కూడా ” హీరో ” అనే టైటిల్ ని పెట్టారు అంతేకాదు వాళ్ళు ఛాంబర్ లో రిజిస్టర్ చేసుకున్న టైటిల్ ని ఆధారాలతో చూపిస్తున్నారు కూడా . దాంతో విజయ్ దేవరకొండ సినిమా టైటిల్ ని మార్చుకోవాలి లేదంటే తమిళంలో మాత్రం వేరే టైటిల్ పెట్టుకుంటే సరిపోతుంది . మరి ఏ నిర్ణయం తీసుకుంటారో విజయ్ దేవరకొండ అండ్ కో .

English Title : Hero title clash between vijay devarakonda and tamil hero