మెగా మేనల్లుడు చిత్రానికి ఉప్పెన టైటిల్


మెగా మేనల్లుడు చిత్రానికి ఉప్పెన టైటిల్
మెగా మేనల్లుడు చిత్రానికి ఉప్పెన టైటిల్

చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా సుకుమార్ శిష్యుడి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే . సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి” ఉప్పెన” అనే టైటిల్ ని పెట్టబోతున్నట్లు సమాచారం . ఇంతకుముందు ఈ చిత్రానికి ” జాలరి ” అనే టైటిల్ ని అనుకున్నట్లు తెలుస్తోంది అలాగే ప్రచారం కూడా సాగింది కట్ చేస్తే …… ఉప్పెన అనే టైటిల్ ని రిజిస్టర్ చేయించారట చిత్ర నిర్మాతలు .

వైష్ణవ్ తేజ్ కు హీరోగా ఇది మొదటి చిత్రం అయితే నటుడిగా మాత్రం ఇదే మొదటి కాదు ఎందుకంటే చిరంజీవి నటించిన శంకర్ దాదా ఎం బిబిఎస్ అనే చిత్రంలో చైర్ లో కూర్చుని ఉండే మతిస్థిమితం లేని బాలుడిగా నటించాడు . సినిమాల మీద ఆసక్తి ఉండటంతో మెగా వారసుడిగా వైష్ణవ్ తేజ్ ఎంట్రీ ఇస్తున్నాడు మరి హీరోగా సక్సెస్ అవుతాడా ? చూడాలి .