హీరో వెంకటేష్ కు గాయాలు !


Venkatesh
Venkatesh

సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ కు గాయాలు అయ్యాయట ! తాజాగా వెంకటేష్ వెంకీ మామ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే . కాగా ఆ సినిమా షూటింగ్ లో భాగంగా యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్న సమయంలో వెంకటేష్ కాలికి గాయం అయ్యింది . అయితే ఆ గాయాన్ని లెక్కచేయకుండా షూటింగ్ లో పాల్గొనడానికి సిద్దమయ్యాడట ! అయితే డాక్టర్లు , చిత్ర బృందం సలహా మేరకు షూటింగ్ ఆపేసి చికిత్స కోసం వెళ్ళాడు .

పూర్తిగా 3 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని సలహా ఇచ్చారట డాక్టర్లు . కాలి మడిమకు దెబ్బ తగిలింది కాబట్టి పరుగెత్తలేడు అలాగే ఫైటింగ్ చేయడం కూడా కష్టమే దాంతో వెంకీ మామ షూటింగ్ కి కొద్దిరోజులు గ్యాప్ ఇవ్వకతప్పదు . ఈ చిత్రాన్ని అక్టోబర్ 4 న విడుదల చేయాలనీ అనుకున్నారు కానీ ఒకవైపు వెంకటేష్ కాలి గాయం , మరోవైపు సైరా నరసింహారెడ్డి చిత్రం అక్టోబర్ 2 న విడుదల అవుతోంది కాబట్టి వెంకీ మామ పోస్ట్ పోన్ అవ్వడం ఖాయం . బాబీ దర్శకత్వంలో తెరెక్కుతున్న ఈ వెంకీ మామ చిత్రంలో వెంకటేష్ కు జోడీగా పాయల్ రాజ్ పుత్ నటిస్తుండగా నాగచైతన్య కు జోడీగా రాశి ఖన్నా నటిస్తోంది .