షూటింగ్ లో ప్రమాదం


షూటింగ్ లో ప్రమాదం జరగడంతో బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ కు గాయాలయ్యాయి దాంతో అతడ్ని ముంబై కి తరలించారు చిత్ర యూనిట్ . యురి చిత్రంలో నటించి అందరి ప్రశంసలు అందుకున్న హీరో ఈ విక్కీ కౌశల్ అయితే తాజాగా ఓ గుజరాతీ చిత్రం కోసం యాక్షన్ సీన్స్ లో నటిస్తుండగా ప్రమాదం జరిగింది . ఓ డోర్ విక్కీ ని బలంగా తాకడంతో దవడ కు గాయమైంది దాంతో ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం ముంబై కి తరలించారు .

ముంబై లో ఈ హీరోకు 13 కుట్లు పడ్డాయి . దాంతో పూర్తి విశ్రాంతి తీసుకుంటున్నాడు విక్కీ కౌశల్ . పూర్తిగా కోలుకున్నాక మళ్ళీ షూటింగ్ లో పాల్గొననున్నాడు విక్కీ కౌశల్ . యురి చిత్రంతో సంచలనం సృష్టించిన ఈ హీరో ప్రస్తుతం హర్రర్ చిత్రంలో నటిస్తున్నాడు . అయితే షూటింగ్ లో గాయపడటం తో విక్కీ కుటుంబం షాక్ కి గురయ్యింది .