5 లక్షలు ఇచ్చిన విజయ్ దేవరకొండ


hero vijay devarakonda 5 lakhs donation for kerala flood relief fundకేరళ లో భారీ వర్షాలతో జనజీవనం అస్త్యవ్యస్తం అయిన విషయం తెలిసిందే . దాదాపు పది జిల్లాలలో ప్రజల జీవన వ్యవస్థ స్తంభించి పోవడంతో ఆర్తనాదాలు మిన్నంటుతున్నాయి దాంతో హృదయం చలించిన విజయ్ దేవరకొండ తన వంతు సహాయంగా 5 లక్షల విరాళాన్ని అందించాడు కేరళ ముఖ్యమంత్రి కి . నా సహాయం అయిదు లక్షలు అలాగే నాతో పాటు మీకు వీలైనంత సహాయం కేరళ ప్రజలకు అందించాల్సిందిగా విజ్ఞప్తి చేసాడు తన అభిమానులకు .

ఇటీవలే అర్జున్ రెడ్డి చిత్రానికి గాను ఫిలిం ఫేర్ ఉత్తమ నటుడు అవార్డు ని అందుకున్నాడు విజయ్ దేవరకొండ . ఆ అవార్డు ని వేలం వేయడం ద్వారా వచ్చిన 25 లక్షల రూపాయలను తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించాడు . ముఖ్యమంత్రి సహాయనిధి కి విరాళం ఇవ్వడం ద్వారా ఆపదలో ఉన్న ప్రజలకు ఆ సహాయం అందుతుందని బలంగా నమ్ముతున్నాడు హీరో విజయ్ దేవరకొండ అందుకే మొన్న తెలంగాణ ముఖ్యమంత్రి కి 25 లక్షలు ఇవ్వగా ఇప్పుడేమో కేరళ ప్రజల కోసం 5 లక్షల విరాళాన్ని ప్రకటించాడు . ఇక ఈ హీరో నటించిన గీత గోవిందం చిత్రంలోని కొన్ని సన్నివేశాలు లీక్ కావడంతో చాలా డిజప్పాయింట్ అయ్యాడు .

English Title: hero vijay devarakonda 5 lakhs donation for kerala flood relief fund