విజయ్ దేవరకొండ క్రేజ్ మాములుగా లేదు


Hero Vijay devarakonda craze is not normal even children

టాలీవుడ్ నయా సూపర్ స్టార్ విజయ్ దేవరకొండ క్రేజ్ మాములుగా లేదు , యువతీ యువకులలో విజయ్ దేవరకొండకు విపరీతమైన క్రేజ్ వచ్చింది పెళ్లి చూపులు , అర్జున్ రెడ్డి , గీత గోవిందం , టాక్సీ వాలా చిత్రాల వల్ల . అయితే యువతీ యువకులకు మాత్రమే కాకుండా పిల్లలలో విజయ్ దేవరకొండకు చాల క్రేజ్ ఉంది దానికి నిదర్శనమే ! ఇద్దరు చిన్నారుల వీడియో .

 

విజయ్ దేవరకొండకు ఆమధ్య షూటింగ్ లో గాయం అయిన విషయం తెలిసిందే . అయితే గాయం మానడానికి డాక్టర్ దగ్గరకు వెళ్లి వైద్యం చేయించుకోవాలని చిన్నారులు ముద్దు ముద్దుగా చెప్పడంతో ఫిదా అయిపోయాడు ఈ హీరో . నాకు డాక్టర్ అవసరం లేదు మిమ్మల్ని చూడాలని ఉందని ట్వీట్ చేసాడు విజయ్ దేవరకొండ , ఈ హీరో చేసిన ట్వీట్ కు స్పందించిన ఆ పిల్లల తండ్రి రీ ట్వీట్ చేసాడు అంతేకాదు ఈరోజు హైదరాబాద్ వస్తున్నాడు పిల్లలతో కలిసి .

English Title: Hero Vijay devarakonda craze is not normal even children