ఐ లవ్ యు చెప్పమంటున్న విజయ్ దేవరకొండ


Hero Vijay Devarakonda emotional touch with Parents
Vijay Devarakonda

మనల్ని కనిపెంచిన అమ్మానాన్న లకు ఐ లవ్ యు అని చెప్పి వాళ్ళు మనకు ఎంత ముఖ్యమో చాటి చెప్పాలని రౌడీ సందేశాన్ని ఇస్తున్నాడు క్రేజీ హీరో విజయ్ దేవరకొండ . అమ్మానాన్న లంటే మన అందరికీ ఇష్టమే కానీ వాళ్లకు ఎప్పుడూ ఐలవ్ యు అని చెప్పం అలాగే ఓ హగ్ ఇవ్వం ఆ పనే చేయండి అప్పుడు వాళ్ళ సంతోషం చూడండి అంటూ కొత్త సంవత్సరం సందర్బంగా చెబుతున్నాడు విజయ్ దేవరకొండ . తన అభిమానులకు చెప్పడమే కాదు ఆ పని తన తల్లిదండ్రులతో చేసి చూపించాడు .

2018 సంవత్సరం విజయ్ దేవరకొండ కు బాగా కలిసి వచ్చింది . గీత గోవిందం , టాక్సీ వాలా చిత్రాలు సూపర్ హిట్స్ అయ్యాయి . నోటా కూడా ఈ ఏడాదే విడుదల అయినప్పటికీ అది ప్లాప్ అయ్యింది . ఇక ప్రస్తుతం డియర్ కామ్రేడ్ అనే చిత్రంలో నటిస్తున్నాడు విజయ్ దేవరకొండ . ఆ సినిమా తర్వాత కె ఎస్ రామారావు నిర్మించనున్న చిత్రంలో నటించనున్నాడు . ఇక న్యూ ఇయర్ వేడుకల కోసం సెల్ ఫోన్ కూడా పనిచేయని దీవి కి వెళ్ళాడు విజయ్ దేవరకొండ .

English Title: Hero Vijay Devarakonda emotional touch with Parents