విజయ్ దేవరకొండ కు నిజంగా సర్ప్రై జే


hero vijay devarakonda shockedమెగాస్టార్ చిరంజీవి తన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వస్తున్నాడంటే నిజంగా సర్ప్రైజే కదా ! ఇప్పుడు అదే సంబ్రమాశ్చర్యానికి గురౌతున్నాడు హీరో విజయ్ దేవరకొండ . ఈ హీరో నటించిన గీత గోవిందం చిత్రం ఈనెల 15 న విడుదల అవుతోంది దాంతో మూడు రోజుల ముందుగా అంటే ఆగస్టు 12న గీత గోవిందం ప్రీ రిలీజ్ ఈవెంట్ ని భారీ ఎత్తున నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు ఆ చిత్ర బృందం . అయితే ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి వస్తున్నాడని విజయ్ దేవరకొండ కు చెప్పగానే షాక్ అయ్యాడట ! నిజంగా వస్తున్నాడా ? అని ఆశ్చర్యపోయాడట .

నిజమే ! మెగాస్టార్ చిరంజీవి అంటే చాలామంది యువకులకు ఆరాధ్యదైవం , ఇక హీరో కావాలని కోరుకునే వాళ్ళు చిరంజీవి లా ఎదగాలని అంతటి స్టార్ డం ని పొందాలని ఆశిస్తారు . విజయ్ దేవరకొండ కూడా బహుశా మెగాస్టార్ ని చూసి ఇన్ స్పైర్ అయి ఉంటాడు అలాంటి హీరో తన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అథితి గా రావడం అంటే విజయ్ కు ఆనందమే కదా ! అర్జున్ రెడ్డి తో యూత్ ఐకాన్ అయిపోయాడు విజయ్ దేవరకొండ . ఇక వరుస విజయాలు సాధిస్తున్న విజయ్ కి గీత గోవిందం ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి .

English Title: hero vijay devarakonda shocked