అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన విజయ్ దేవరకొండ


Hero Vijay Deverakonda admitted to Hospital

టాలీవుడ్ నయా సూపర్ స్టార్ విజయ్ దేవరకొండ అనారోగ్యానికి గురయ్యాడు దాంతో ఆసుపత్రిలో చేరి రకరకాల టెస్ట్ లను చేయించు కోవడమే కాకుండా చికిత్స కూడా తీసుకుంటున్నాడు ఈ హీరో . వరుసగా షూటింగ్ లతో బిజీ గా ఉన్న ఈ హీరో అస్వస్థతకు గురి కావడంతో ఆలస్యం చేయకుండా వెంటనే హైదరాబాద్ లోని ఓ ప్రవైట్ ఆసుపత్రిలో చికిత్స కోసం చేరాడు .

 

అంతేకాదు ఈ విషయాన్నీ తానే ట్వీట్ చేసి తన అభిమానులకు చెప్పాడు కూడా . ఎందుకంటే ఎవరో ఈ విషయం బయట చెప్పడం దాంతో రకరకాల ఊహాగానాలతో వార్తలు వస్తాయి కాబట్టి ఆసుపత్రిలో చేరిన విషయాన్నీ చెప్పాడు విజయ్ దేవరకొండ . ప్రస్తుతం ఈ హీరో డియర్ కామ్రేడ్ , క్రాంతిమాధవ్ చిత్రాలతో బిజీ గా ఉన్నాడు . ఇక ఇటీవలే డియర్ కామ్రేడ్ చిత్ర టీజర్ నాలుగు బాషలలో రిలీజ్ అయి ట్రెండ్ సృష్టిస్తోంది .

English Title : Hero Vijay Deverakonda admitted to Hospital