ఫిల్మ్ ఫేర్ అవార్డు ని వేలం వేసిన విజయ్ దేవరకొండ


 hero Vijay Deverakonda Film Fare Award sold for Rs 25 Lakhs

అర్జున్ రెడ్డి చిత్రంలో అసమాన నటన ప్రదర్శించినందుకు గాను విజయ్ దేవరకొండ ని ఫిల్మ్ ఫేర్ అవార్డు వరించిన విషయం తెలిసిందే , కాగా ఆ అవార్డు ని అందుకున్న సమయంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధి కోసం ఈ ఫిల్మ్ ఫేర్ అవార్డు ని వేలం వేస్తానని దాని ద్వారా వచ్చిన మొత్తాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ కి అందిస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే . చెప్పిన మాట ప్రకారం నిన్న హైదరాబాద్ లో ఫిల్మ్ ఫేర్ అవార్డు ని వేలం వేసాడు కాగా ఈ అవార్డు ఏకంగా 25 లక్షలు పలికింది దాంతో ఆ మొత్తాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ కోసం సీఎం కు అందిస్తానని తెలిపాడు విజయ్ దేవరకొండ .

ఇక ఈ అవార్డు ని 25 లక్షలకు సొంతం చేసుకున్నది ఎవరో తెలుసా …… ఫార్మా కంపెనీ కి చెందిన దివి ల్యాబ్స్ అధినేత భార్య శకుంతల దివి 25 లక్షలు చెల్లించి సొంతం చేసుకుంది . నాలుగేళ్ళ క్రితం వచ్చిన ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రంతో మెరిసిన విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు చిత్రంతో సంచలనం సృష్టించాడు ఇక అర్జున్ రెడ్డి చిత్రంతో ప్రభంజనం సృష్టించాడు . అర్జున్ రెడ్డి చిత్రంతో స్టార్ డం అందుకున్నాడు విజయ్ దేవరకొండ . నిన్న వేలం వేయగా శకుంతల దివి ఆ ఫిల్మ్ ఫేర్ ని సొంతం చేసుకోవడంతో పెద్ద మొత్తమే సీఎం రిలీఫ్ ఫండ్ కి అందిస్తున్నాడు విజయ్ దేవరకొండ . యువ నాయకులు కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడు విజయ్ దేవరకొండ దాంతో ఈ పని చేస్తున్నాడు .

English Title: hero Vijay Deverakonda Film Fare Award sold for Rs 25 Lakhs