ఆ హీరో రాజకీయాల్లోకి రావడం లేదు


hero vijay political plans end

తమిళనాట స్టార్ హీరో అయిన విజయ్ రాజకీయాల్లోకి రావాలని అనుకున్నాడు కట్ చేస్తే తమిళనాట ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో విజయ్ యు టర్న్ తీసుకున్నాడని ,రాజకీయాల్లోకి రావడం లేదట అందుకు కారణం ఏంటో తెలుసా …… సీనియర్ హీరోలు రజనీకాంత్ , కమల్ హాసన్ లు రాజకీయాల్లోకి రావడమే ! అని తెలుస్తోంది . కమల్ హాసన్ ఏకంగా రాజకీయ పార్టీ ని ప్రకటించగా రజనీకాంత్ కూడా త్వరలోనే పార్టీ పేరు ని ప్రకటించనున్నాడు .

గత ఏడాది విజయ్ రాజకీయాలలోకి రాబోతున్నాడు అంటూ విజయ్ తండ్రి చంద్రశేఖర్ తెలిపాడు . విజయ్ రాజకీయాల్లోకి రావడం ఖాయమని కుళ్ళిన ఈ రాజకీయాలను ప్రక్షాళన చేయడం ఖాయమని అన్నాడు కట్ చేస్తే ఏడాది గడిచే సరికి పరిస్థితులు మారిపోయాయి . రజనీకాంత్ , కమల్ హాసన్ లు ఇద్దరు కూడా రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు కాబట్టి ఇప్పుడు విజయ్ రాజకీయాలలోకి వెళ్లడం వల్ల పెద్దగా ఒనగూడే ప్రయోజనం ఉండదని భావించారట అందుకే రాజకీయాల ఆలోచన విరమించుకున్నాడు విజయ్ .