సైకిల్‌పై వ‌చ్చి ఓటేసిన హీరో విజ‌య్‌!

సైకిల్‌పై వ‌చ్చి ఓటేసిన హీరో విజ‌య్‌!
సైకిల్‌పై వ‌చ్చి ఓటేసిన హీరో విజ‌య్‌!

త‌మిళ‌నాడుతో శాస‌న స‌భ ఎన్నిక‌లు జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఓ ప‌క్క మండుతున్న ఎండ‌లు, మ‌రో ప‌క్క క‌రోనా సెకండ్ వేవ్ నేప‌థ్యంలో ఎన్నిక‌లు జ‌రుగుతుండ‌గా త‌మిళ ఇండ‌స్ట్రీకి చెందిన ప‌లువురు స్టార్స్ ఒక్కొక్క‌రు ఒక్కో త‌ర‌హాలో పోలింగ్ బూత్‌కి చేరుకుని త‌మ ఓటు హ‌క్కుని వినియోగించుకున్నారు. ఎండ‌లు మండిపోతుండ‌టంతో ఓట‌ర్లు ఉద‌యం నుంచే పోలీంగ్ కేంద్రాల‌ వ‌‌ద్ద బారులు తీరారు.

ప్ర‌ముఖ స్టార్ హీరో విజ‌య్ వినూత్నంగా సైకిల్‌పై వ‌చ్చి త‌న ఓటు హ‌క్కుని వినియోగించుకున్నారు. చెన్నైలోని నీలంక‌రైలో గ‌త ఓ పోలీంగ్ కేంద్రానికి హీరో విజ‌య్ త‌న ఇంటి నుంచి సైకిల్‌పై బ‌య‌లుదేరి పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. అనంత‌రం క్యూ లో నిల‌బ‌డి త‌న ఓటు హ‌క్కుని వినియోగించుకున్నారు.

ఈ సంద‌ర్భంగా సైకిల్‌పై విజ‌య్‌ని చూసిన ఆయ‌న అభిమానులు ర్యాలీగా విజ‌య్ వెంట న‌డిచారు. ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. విజ‌య్ సైకిల్‌పై వ‌స్తున్న దృశ్యాలు సోల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ఇదిలా వుంటే దేశంలో పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధ‌ర‌ల‌కు నిర‌స‌న‌గానే విజ‌య్ సైకిల్‌పై వ‌చ్చిన‌ట్లు కొన్ని మీడియాల్లో ప్ర‌త్య‌కంగా క‌థనాలు వ‌స్తున్నాయి.