ఫ్యాన్స్‌తో ఒక్క సెల్పీ ఎన్నో అర్థాలు!

ఫ్యాన్స్‌తో ఒక్క సెల్పీ ఎన్నో అర్థాలు!
ఫ్యాన్స్‌తో ఒక్క సెల్పీ ఎన్నో అర్థాలు!

త‌మిళ స్టార్ హీరోల్లో ఇళ‌య‌ద‌ళ‌ప‌తికున్న క్రేజే వేరు. సూప‌ర్‌స్టార్ త‌రువాత ఆ స్థాయి స్టార్‌డ‌మ్‌ని సొంతం చేసుకున్నారు విజ‌య్‌. ఇటీవ‌ల ఆయ‌న న‌టించిన క‌త్తి, థేరి, మెర్స‌ల్, స‌ర్కార్, బిగిల్ చిత్రాలు వంద కోట్ల మార్కుని దాటి త‌మిళ నాట సంచ‌ల‌నం సృష్టించాయి. వ‌రుస విజ‌యాల‌తో విజ‌య్ స్టార్‌డమ్‌తో పాటు ఫాలోయింగ్ కూడా విప‌రీతంగా పెరిగిపోయింది. పిలుపిస్తే చెన్నై న‌గ‌రాన్ని బందీ చేసే అంత అభిమాన‌జనం విజ‌య్ సొంతం.

అదే ఇప్పుడు విజ‌య్ బ‌లంగ మారింది. ఇటీవ‌ల విజ‌య్ న‌టించిన చిత్రాల్లో అధికార పార్టీలతో పాటు కేంద్రంపై కూడా విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిసింది. దీంతో అధికార పార్టీ వ‌ర్గాలు విజ‌య్ పై, అత‌ని సినిమాల‌పై గుర్రుగా వున్నారు. మెర్స‌ల్‌లో ప్ర‌భుత్వ వైద్య విధానం, జీఎస్టీపై అదిరిపోయే పంచ్‌లు వేశారు. ఆ డైలాగ్ ల  కాణంగా త‌మిళ‌నాడుతో సినిమా రిలీజ్ కాకుండా అడ్డుకోవాల‌ని, లేదంటే చిత్రాన్ని బ్యాన్ చేయాల‌ని బీజేపీ వ‌ర్గాలు ప్లాన్ చేశాయి. దీంతో వెన‌క్కి త‌గ్గిన చిత్ర బృందం ఆ డైలాగ్‌ల‌ని తొల‌గించ‌డంతో `మెర్స‌ల్` రిలీజ్ సాఫీగా జరిగిపోయింది.

తాజాగా విజ‌య్ `మాస్ట‌ర్` చిత్రంలో న‌టిస్తున్నారు. లొకేష‌న్‌కి వెళ్లి విజ‌య్‌ని ఇంటికి వెంట‌బెట్టుకొచ్చిన విజిలెన్స్ బృందం విజ‌య్ ఇంటిపై ఆక‌స్మిక దాడికి దిగ‌డం త‌మిళ‌నాట సంచ‌ల‌నం సృష్టించింది. దీనిపై విజ‌య్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఆందోళ‌న‌కు దిగారు. త‌మ హీరోని టార్గెట్ చేస్తున్నార‌ని, అత‌నికి అండ‌గా తామున్నామ‌ని బీజేపీ వ‌ర్గాల‌కు హెచ్చ‌రిక‌లు జారీ చేశారు విజ‌య్ మాత్రం స్పందించ‌కుండా కేవ‌లం త‌న‌ని స‌పోర్ట్ చేయ‌డానికి వ‌చ్చిన త‌న ఫ్యాన్స్‌తో సెల్పీని దిగి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. విజ‌య్ తీసుకున్న సెల్ఫీ ఎన్నో అర్థాల్ని తెలియ‌జేస్తోంద‌ని తమిళ వ‌ర్గాలు అంటున్నాయి. మ‌రి దీనిపై విజ‌య్ ఎలా స్పందిస్తాడో లేక అదే నిజ‌మ‌ని సైలెంట్‌గా త‌న ప‌ని తాను చేసుకుపోతాడో చూడాలి.