ఆ సినిమా ఆ హీరోకే నచ్చలేదట


hero vijay sethupathi sensational comments on his own film

నేను నిర్మించిన చిత్రం నాకే నచ్చలేదు ఇక మీకేం నచ్చుతుందని సంచలన వ్యాఖ్యలు చేసాడు తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి . తమిళనాట తిరుగులేని విజయాలను సాధిస్తున్న ఈ హీరో తాజాగా తన మిత్రుడు లెనిన్ భారతి దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ” మెర్కు తొడర్చి మలై ” . ఇటీవలే విడుదలైన ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు లభిస్తున్నాయి అయితే వసూళ్లు అంతగా లేవు అయినప్పటికీ క్రిటిక్స్ మెప్పు పొందడంతో థాంక్స్ మీట్ ఏర్పాటు చేసారు చెన్నై లో . ఆ వేడుకలో పాల్గొన్న విజయ్ సేతుపతి నాకు ఈ చిత్రం నచ్చలేదని మొహమాటం లేకుండా చెప్పాడు , దాంతో బిత్తర పోవడం ఆహుతుల వంతయ్యింది .

ఈ సినిమా నచ్చలేదు కాబట్టే విడుదలలో జాప్యం జరిగిందని , అంతేకాకుండా ” మెర్కు తొడర్చి మలై ” చిత్రాన్ని కొనడానికి , విడుదల చేయడానికి ఎవరూ ముందుకు రాలేదని , ఒకరిద్దరు ముందుకు వచ్చి అడ్వాన్స్ ఇచ్చినప్పటికీ తర్వాత ఆ సొమ్ము తీసుకున్నారని ఆ సమయంలో శరవణన్ ముందుకు వచ్చి మా చిత్రాన్ని విడుదల చేసారని ….. ఈ క్రెడిట్ అంతా లెనిన్ భారతి , శరవణన్ లదే అని అంటున్నాడు . అంతేకాదు లెనిన్ భారతి నేను జూనియర్ ఆర్టిస్ట్ గా ఉన్నప్పటి నుండి పరిచయమని అందుకే అతడి కోసం ఈ సినిమా నిర్మించానని అంటున్నాడు విజయ్ సేతుపతి . మిత్రుడి కోసం సినిమా నిర్మించాడు బాగుంది కానీ థాంక్స్ మీట్ పెట్టి నాకు ఈ సినిమా నచ్చలేదు అని చెప్పడమే బాగోలేదు . ఈ హీరోకు ఫాలోయింగ్ ఎక్కువ కాబట్టి ఇతడే బాగోలేదు అంటే ఎవరు మాత్రం చూస్తారు ఆ సినిమాని విచిత్రం కాకపోతే .

English Title: hero vijay sethupathi sensational comments on his own film