ఆటో డ్రైవర్ లకు భోజనం పెట్టించిన హీరో


 

తమిళ స్టార్ హీరో విజయ్ ఆటో డ్రైవర్ లకు ఒక పూట భోజనం పెట్టించాడు నిన్నటి రోజున . చెన్నై లో ప్రతీ ఏడాది మేడే రోజున ఆటో డ్రైవర్ ల కోసం భోజన వసతి ఏర్పాటు చేస్తుంటాడు ఈ హీరో . పదేళ్ల క్రితం విజయ్ ” వేట్టైకారన్ ” అనే చిత్రంలో ఆటో డ్రైవర్ గా నటించాడు దాంతో అప్పటి నుండి ఆటో డ్రైవర్ ల కోసం పార్టీ ఏటా మేడే రోజున భోజనం ఏర్పాటు చేయిస్తుంటాడు ఒకరోజు .

అయితే ఈఏడాది మాత్రం మేడే రోజున భోజనవసతి కల్పించలేదు దాంతో కొద్దిరోజులు ఆలస్యంగా నిన్న భోజనం పెట్టించాడు . ఈ కార్యక్రమానికి వందల సంఖ్యలో ఆటో డ్రైవర్ లు పాల్గొన్నారు . అయితే ఇంతపెద్ద మొత్తంలో బోజనాలను ఏర్పాటు చేసినప్పటికీ హీరో విజయ్ ఈ కార్యక్రమంలో పాల్గొనకపోవడంతో ఆటో డ్రైవర్ లు నిరుత్సాహపడ్డాడు . తాజాగా విజయ్ అట్లీ దర్శకత్వంలో తన 63 వ చిత్రాన్ని చేస్తున్నాడు .