కారుతో భారీ యాక్సిడెంట్ చేసిన స్టార్ హీరో కొడుకు


hero vikram son dhruv car accident

తమిళ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ కారుతో భారీ యాక్సిడెంట్ చేయడం సంచలనం సృష్టించింది . అత్యంత వేగంగా వచ్చి ఆటో ని గుద్దడంతో ఆటో డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి దాంతో అతడి పరిస్థితి విషమంగా ఉంది ఇక ధృవ్ ప్రయాణించిన కారు బాగా దెబ్బతింది . సంచలనం సృష్టించిన ఈ సంఘటన ఈరోజు తెల్లవారు ఝామున జరిగింది . ఈరోజు తెల్లవారు ఝామున చెన్నై లోని పాండీబజార్ లో వేగంగా కారు నడుపుకుంటూ వచ్చాడు యంగ్ హీరో ధృవ్ , అయితే కారు చాలా వేగంగా రావడం వల్ల అదుపుతప్పి పక్కనే ఉన్న ఆటో ని బలంగా డీ కొట్టింది . ఆ ఆటోలో ఉన్న డ్రైవర్ కాళ్ళు విరిగాయి యాక్సిడెంట్ కు అంతేకాదు అతడి పరిస్థితి కూడా విషమంగా ఉంది .

ప్రస్తుతం ఆటో డ్రైవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు , 24 గంటలు గడిస్తే కానీ అతడి పరిస్థితి ఏంటి అన్నది అర్ధం కాదు . ఇక హీరో ధృవ్ యాక్సిడెంట్ చేసిన సంఘటన పోలీసులకు తెలియడంతో కారుని స్వాధీనం చేసుకొని అతడ్ని ప్రశ్నిస్తున్నారు . యంగ్ హీరో ధృవ్ ప్రస్తుతం అర్జున్ రెడ్డి రీమేక్ లో నటిస్తున్నాడు . తెలుగునాట ప్రభంజనం సృష్టించిన అర్జున్ రెడ్డి తమిళ్ లో ” వర్మ” గా రీమేక్ అవుతోంది . అయితే ధృవ్ మద్యం మత్తులో ఈ యాక్సిడెంట్ చేసినట్లుగా తెలుస్తోంది .

English Title: hero vikram son dhruv car accident