హీరో విశాల్ ని అరెస్ట్ చేసిన పోలీసులు


Hero Vishal arrested in chennai
Vishal

చెన్నై పోలీసులు హీరో విశాల్ ని అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు . తమిళనాట స్టార్ హీరో అయిన విశాల్ నిర్మాత కూడా . దాంతో నిర్మాతల మండలి అధ్యక్షుడు గా పనిచేస్తున్నాడు . అయితే నిర్మాతల మండలి పదవి బాధ్యతలు చేపట్టిన విశాల్ ఇప్పటివరకు అన్ని హామీలను తుంగలో తొక్కాడని , అంతేకాకుండా 8 కోట్ల అవినీతికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ నిన్న విశాల్ ఛాంబర్ కు తాళాలు వేశారు విశాల్ వ్యతిరేకులు .

అయితే నిన్న తాళం వేసిన సమయంలో విశాల్ చెన్నై లో లేడు దాంతో నేరుగా ఈరోజు తన ఛాంబర్ కు చేరుకున్నాడు . అయితే అప్పటికే అక్కడకు విశాల్ వ్యతిరేకులు అలాగే పోలీసులు చేరుకొని విశాల్ ని అడ్డుకున్నారు . బయటి వాళ్ళు వచ్చి నా ఛాంబర్ కు తాళాలు వేస్తే మీరు అడ్డుపడాల్సింది పోయి నన్ను అడ్డుకోవడం ఏంటి ? అని పోలీసులతో వాగ్వాదానికి దిగాడు విశాల్ . దాంతో పోలీసులు విశాల్ ని అరెస్ట్ చేయడంతో ఆగ్రహించిన విశాల్ న్యాయపోరాటం చేస్తానని శపథం చేసాడు .

English Title: Hero Vishal arrested in chennai