తమిళ రాకర్స్ పై విశాల్ ఆగ్రహం


Hero Vishal fires on Tamil rockers
కొత్త సినిమాలు అందునా స్టార్ హీరోల సినిమాలు ఇలా విడుదల అవ్వడమే ఆలస్యం వెంటనే వాటిని పైరసీదారులైన తమిళ రాకర్స్ పూర్తి హెచ్ డి క్వాలిటీ తో సినిమాలను పెట్టేస్తున్నారు దాంతో కలెక్షన్ల పరంగా చాలా పెద్ద దెబ్బ పడుతోంది నిర్మాతలకు అందుకే తమిళ రాకర్స్ ఆట కట్టించాలని విశాల్ ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ కుదరడమే లేదు . దాంతో విశాల్ పై పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నారు అతడి వ్యతిరేక వర్గం .

 

ఇటీవలే ఇళయరాజా , ఏ ఆర్ రెహ్మాన్ లకు పెద్ద ఎత్తున సన్మాన కార్యక్రమం చేపట్టాడు విశాల్ . అయితే ఈ సన్మాన కార్యక్రమానికి మద్దతు ఇచ్చే వాళ్ళు ఉన్నారు అలాగే వ్యతిరేకించిన వాళ్ళు కూడా ఉన్నారు . సన్మాన విషయాన్నీ పక్కన పెడితే తమిళ రాకర్స్ అంతు చూడాలంటే ప్రభుత్వాలు తలుచుకుంటే సరిపోతుందని , అది త్వరలోనే కార్యరూపం దాల్చుతుందన్న విశ్వాసం వ్యక్తం చేసాడు విశాల్ .

English Title: Hero Vishal fires on Tamil rockers