శ్రీ రెడ్డి నన్ను కూడా టార్గెట్ చేస్తుందేమో : హీరో విశాల్


hero vishal responds on nani and sri reddy issue

వివాదాస్పద నటి శ్రీ రెడ్డి నన్ను కూడా టార్గెట్ చేస్తుందేమో అని సంచలన వ్యాఖ్యలు చేసాడు స్టార్ హీరో విశాల్ . హీరో నాని నాకు మంచి స్నేహితుడని అతడి పై శ్రీ రెడ్డి చేస్తున్న ఆరోపణలు నిజం కావని ఒకవేళ ఆమె దగ్గర సాక్ష్యాలు ఉంటే వాటిని బయటపెట్టాలని అంతేకాని ఊరికే సంచలనాల కోసం ఆరోపణలు చేయడం తగదని అంటున్నాడు విశాల్ . హీరో నాని తమిళ్ లో కూడా సినిమాలు చేసిన విషయం తెలిసిందే . అలాగే విశాల్ తమిళ్ లో స్టార్ హీరో అయినప్పటికీ తెలుగు కుర్రాడు కానీ చెన్నై లో స్థిరపడటం వల్ల తమిళ వ్యక్తి అయిపోయాడు .

గతకొంతకాలంగా శ్రీ రెడ్డి తెలుగునాట వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ రకరకాల ఫోటోలను లీక్ చేస్తున్న విషయం తెలిసిందే . తాజాగా నాని పై అదేపనిగా విమర్శలు గుప్పిస్తోంది దాంతో నాని లీగల్ గా ప్రొసీడ్ అయ్యాడు . నాని లీగల్ నోటీసులు పంపించడంతో మళ్ళీ రెచ్చిపోయి ఆరోపణలు చేస్తోంది శ్రీ రెడ్డి . అయితే ఆరోపణలు చేయడం కాదు నీ దగ్గర సాక్ష్యాలు ఉంటే బయట పెట్టు అని అనడమే కాకుండా నాపై ఆరోపణలు చేసినా ఆశ్చర్యం లేదు అంటూ భయపడుతున్నాడు హీరో విశాల్ . ఈ విషయం పై శ్రీ రెడ్డి ఎలా స్పందిస్తుందో చూడాలి .