మాట తప్పిన హీరో విశాల్


మాట తప్పిన హీరో విశాల్

Hero Vishal throws his promise
Hero Vishal throws his promise

తమిళ స్టార్ హీరో విశాల్ తన మాట తప్పాడు . విశాల్ తప్పిన మాట ఏంటో తెలుసా ….. ఇంతకీ విశాల్ ఇచ్చిన మాట ఏంటో తెలుసా …… టెంపర్ ని తమిళ్ లో రీమేక్ చేస్తున్నాను కానీ తెలుగులో మాత్రం ఆ సినిమాని విడుదల చేయను ఎందుకంటే నా యాక్టింగ్ ని ఎన్టీఆర్ యాక్టింగ్ ని కంపేర్ చేసి చూస్తారు కాబట్టి అంటూ రెండేళ్ల క్రితం మాట ఇచ్చాడు విశాల్ . కానీ ఇప్పుడు ఆ మాట తప్పుతున్నాడు .

విశాల్ నటించిన అయోగ్య చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు అయోగ్య పేరు తోనే . ఎన్టీఆర్ నటించిన టెంపర్ 2015 లో విడుదలై సూపర్ హిట్ కాగా ఆ చిత్రాన్ని అయోగ్య పేరుతో తమిళ్ లో రీమేక్ చేసారు . మే 11 న అయోగ్య విడుదలైంది . ఆశించిన స్థాయిలో బ్లాక్ బస్టర్ కాలేదు కానీ ఓకే అనిపించుకుంది . అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా రాశి ఖన్నా నటించింది . త్వరలోనే డబ్బింగ్ కార్యక్రమాలను పూర్తిచేసి తెలుగులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .