గ్రేట్ డైరెక్ట‌ర్‌కే ప్ర‌పోజ్ చేసిన అదితీరావు హైద‌రీ!


గ్రేట్ డైరెక్ట‌ర్‌కే ప్ర‌పోజ్ చేసిన అదితీరావు హైద‌రీ!
గ్రేట్ డైరెక్ట‌ర్‌కే ప్ర‌పోజ్ చేసిన అదితీరావు హైద‌రీ!

హిందీ, తెలుగు భాష‌ల్లో క్రేజీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది అదితీరావు హైద‌రీ. గ‌త కొంత కాలంగా తెలుగు, త‌మిళ చిత్రాల్లో న‌టిస్తూ ఇక్క‌డే త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటోంది. అయితే ఓ డైరెక్ట‌ర్‌కు అదితి ప్ర‌పోజ్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. తాజాగా ఓ ద‌ర్శ‌కుడికి ప్ర‌పోజ్ చేస్తున్న ఓ ఫొటోని సోష‌ల్ మీడియా ఇన్ స్టా వేదిక‌గా నెటిజ‌న్స్‌తో పంచుకుంది.

ప్ర‌స్త‌తం ఆ ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.  వివ‌రాల్లోకి వెళితే.. మూడేళ్ల క్రితం అదితీరావు హైద‌రీ న‌టించిన చిత్రం `కాట్రు వెలియిడై`. దిగ్రేట్ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం ఈ చిత్రాన్ని  తెర‌కెక్కించాడు. దిల్ రాజు ఇదే చిత్రాన్ని తెలుగులో `చెలియా` పేరుతో రిలీజ్ చేశారు. కార్తి హీరోగా, అదితీరావు హైద‌రీ హీరోయిన్‌గా న‌టించింది.

ఈ చిత్ర షూటింగ్ లొకేష‌న్‌లో స‌ర‌దాగా ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నంకు అదితీరావు హైద‌రీ ప్ర‌పోజ్ చేసింద‌ట‌. చేతికి రెడ్ రోజ్‌ని అందిస్తూ నేల‌పై మోకాళ్ల‌పై కూర్చొని ప్ర‌పోజ్ చేసింద‌ట‌. ఇప్పుడా ఫొటోని లాక్ డౌన్ వేళ ఇన్‌స్టాలో పోస్ట్ చేయ‌డంతో అంతా అవాక్క‌వుతున్నారు. అయితే ఇది మూడేళ్ల క్రితం ఫొటో అని అదితి చెప్ప‌డంతో అంతా న‌వ్వుకుంటున్నారు.

 

View this post on Instagram

 

#ManiSir… The reason I believe dreams come true. #3YearsOfKaatruVeliyidai #Believe #Magic #NeverGrowUp

A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) on