అందరి ముందు కౌగిలి ఇచ్చి షాక్ ఇచ్చిన భామ


heroine amala paul reveals her first loveహీరోయిన్ అమలా పాల్ దర్శకుడు విజయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది అయితే ఆ పెళ్లి జీవితం ఎంతో కాలం నిలవలేదు ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో ఇద్దరూ విడాకులు తీసుకున్నారు . కట్ చేస్తే మళ్ళీ సినిమాల్లోకి వచ్చింది పైగా అంతకుముందు కంటే ఎక్కువగా రెచ్చిపోయి అందాలను ఆరబోస్తూ షాక్ ఇస్తోంది ఈ నల్లభామ . తెలుగు , తమిళ చిత్రాల్లో నటిస్తున్న ఈ భామ తాజాగా మరో బాంబ్ పేల్చింది .

ఇంతకీ అమలా పాల్ పేల్చినా బాంబ్ ఏంటో తెలుసా ……. దర్శకుడు విజయ్ తో నాది తొలిప్రేమ కాదు అంతకంటే ముందే నేను ప్రేమలో పడ్డాను అయితే అతడితో ఆ ప్రేమ విషయం చెప్పలేదు ఆలోగానే విజయ్ తో మలి ప్రేమలో పడ్డాను . ఇంతకీ నేను ప్రేమించిన మొట్ట మొదటి వ్యక్తి ఎవరో తెలుసా ……. హీరో మాధవన్ అంటూ బాంబ్ పేల్చింది అమలా పాల్ . అవును హీరో మాధవన్ అంటే నాకు చాలా చాలా ఇష్టం , అతడ్ని నేను ప్రేమించాను అంటూ అందరి ముందే మాధవన్ దగ్గరకు వెళ్లి మరీ కౌగిలింత ఇచ్చింది దాంతో షాక్ అవ్వడం ఆహుతుల వంతయ్యింది . పెళ్ళికి ముందు అంతగా గ్లామర్ గా నటించని ఈ భామ విడాకుల తర్వాత మాత్రం రెచ్చిపోయి ఎక్స్ పోజింగ్ చేస్తోంది అమలా పాల్ .

English Title: heroine amala paul reveals her first love