భారీ ప్రమాదం నుండి బయటపడిన హీరోయిన్


heroine ananya pandey great escape from car accident,బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే భారీ ప్రమాదం నుండి తృటిలో తప్పించుకుంది . షూటింగ్ లో భాగంగా కారు నడుపుతున్న అనన్య పాండే అదుపుతప్పి నేరుగా చెట్టుకి గుద్దడంతో తృటిలో ఘోరమైన ప్రమాదం నుండి తప్పించుకుంది . అయితే అనూహ్యంగా జరిగిన ఈ పరిణామంతో షాక్ కి గురయ్యింది అనన్య దాంతో వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు చికిత్స కోసం . బాలీవుడ్ నటుడు చుంకీ పాండే కూతురైన అనన్య పాండే ” స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 ” చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అవుతోంది .

స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ చిత్రం 2012 లో విడుదలై సంచలన విజయం సాధించిన నేపథ్యంలో ఆ చిత్రానికి సీక్వెల్ గా ఈ ”స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 ” రూపొందుతోంది . చుంకీ పాండే కూతురు అనన్య పాండే పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్న సమయంలో కారు చెట్టు ని డీ కొట్టడంతో షూటింగ్ రద్దు చేసారు . అయితే అనన్య పాండే కు పెద్దగా గాయాలు కాలేదు కానీ షాక్ కి గురయ్యింది దాంతో విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని చెప్పారట డాక్టర్లు .