పండంటి బాబుకు జ‌న్మ‌నిచ్చిన `గోపాల గోపాల` భామ!



పండంటి బాబుకు జ‌న్మ‌నిచ్చిన `గోపాల గోపాల` భామ!
పండంటి బాబుకు జ‌న్మ‌నిచ్చిన `గోపాల గోపాల` భామ!

`అలియాస్ జాన‌కి` చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన అనీషా ఆంబ్రోస్ ఆ త‌రువాత ప‌వ‌న్‌క‌ల్యాణ్ న‌టించిన `గోపాల గోపాల` చిత్రంలో సహాయ న‌టిగా క‌నిపించి ఆక‌ట్టుకుంది. `స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్‌`లో ప‌వ‌న్‌కు జోడీగా న‌టించే అవ‌కాశం వ‌స్తుందని ఆశగా ఎదురుచూసిన అనీషాకు నిరాశే ఎదురైంది.

ర‌న్‌, ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ, ఫ్యాష‌న్ డిజైన‌ర్ కేరాఫ్ లేడీస్ టైల‌ర్‌, ఒక్క‌డు మిగిలాడు, త‌రుణ్ భాస్క‌ర్ రూపొందించిన `ఈ న‌గ‌రానికి ఏమైంది` వంటి చిత్రాల్లో న‌టించి మంచి గుర్తింపుని సొంతం చేసుకుంది. అయితే ఆశించిన స్థాయిలో స్టార్ హీరోల చిత్రాల్లో అవ‌కాశాలు రాక‌పోవ‌డంతో ఏడాది క్రితం హైదరాబాద్‌కు చెందిన బిజినెస్ మెన్ గుణనాథ్‌ జ‌క్కాని వివాహం చేసుకుంది.

నాలుగు నెల‌ల క్రితం బేబీ బంప్ ఫొటోల‌తో ఆశ్చ‌ర్య‌ప‌రిచిన అనీషా ఆంబ్రోస్ ఈ రోజు (శుక్ర‌వారం) ఓ పండంటి మగ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. సోష‌ల్ మీడియా ఇన్‌స్టా గ్రామ్‌లో ఓ ఫొటోని షేర్ చేసిన అనీషా ఆంబ్రోస్ త‌న‌కు మ‌గ బిడ్డ పుట్టాడ‌ని ప్ర‌క‌టించింది.